జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan klayan ( రెండు పడవల ప్రయాణం చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.పవన్ ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు రాజకీయాలతో బిజీగా ఉన్నారు.
అయితే 2024 ఎన్నికలకు మరో 9 నెలల సమయం మాత్రమే ఉంది.మరోవైపు పవన్ కళ్యాణ్ నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నారు.
మరోవైపు పవన్ నాలుగు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఈ నాలుగు సినిమాలలో ఒక సినిమా అయిన బ్రో( Bro movie ) ఈ నెల 28వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.అయితే పవన్ అటు రాజకీయాలకు, ఇటు సినిమాలకు సమ న్యాయం చేయాల్సి ఉంది.పవన్ కళ్యాణ్ ముందు ఉన్న అతిపెద్ద సవాళ్లు ఇవే కాగా ఈ సమస్యలకు పవన్ ఏ విధంగా చెక్ పెడతారో చూడాల్సి ఉంది.
మరోవైపు 2024 ఎన్నికల్లో జనసేన( Jana sena )కు అనుకూలంగా ఫలితాలు వస్తాయని సర్వేలు వెల్లడిస్తున్నాయి.
ఇప్పటికే చంద్రబాబు, జగన్( CM jagan ) పరిపాలన చూసి వీళ్ల పరిపాలన నచ్చని వాళ్లు పవన్ పరిపాలనపై ఆసక్తి చూపిస్తున్నారు.2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తారా? లేక ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా? అనే ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది.పవన్ సినిమాల్లో కొనసాగితే ఒక సినిమాకు 80 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ దక్కుతుంది.
అయినప్పటికీ పవన్ కళ్యాణ్ మాత్రం రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు.యూత్ లో పవన్ కళ్యాణ్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఊహించని రేంజ్ లో ఉంది.
పవన్ కళ్యాణ్ ఈ ఏడాదే ఓజీ సినిమాను రిలీజ్ చేస్తారని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.పవన్ కళ్యాణ్ ను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం హాట్ టాపిక్ అవుతోంది.