కోళ్ల గురించి చర్చించుకుంటే నాటు కోళ్లు, బాయిలర్ కోళ్లు ( Broiler Chicken )రెండు రకాలు ఉన్నాయని అందరికీ తెలిసిందే.రెండు రకాల కోళ్ళకు శరీరాలపై ఈకలు ఉంటాయి.
చికెన్ గా ఉపయోగించుకునే క్రమంలో శరీరంపై ఉండే ఈ కలను తీసేసి చికెన్ వండుకుంటారని మనందరికీ తెలిసిందే.వాతావరణ పరిస్థితులలో జరుగుతున్న మార్పుల వల్ల అధిక ఉష్ణోగ్రతలకు తట్టుకోలేక కోళ్లు చనిపోతూ ఉండడంతో కోళ్ల పరిశ్రమల నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు.
అయితే ఈ సమస్యను పరిష్కరించడం కోసం ఇజ్రాయిల్(I srael) జన్యు శాస్త్రవేత్త, పౌల్ట్రీ నిపుణుడు, జెరూసలేంలోని హిబ్రూ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ అవిగ్డోర్ కాహానర్( Avigdor Kahaner) అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే ఈకలు లేని కోళ్లను సృష్టించాడు.ఈ కోళ్లను నేక్డ్ కోళ్లు గా నామకరణం చేశాడు.ఈ కోళ్లు అధిక ఉష్ణోగ్రతల వద్ద కూడా ఎటువంటి ఇబ్బందులకు గురికావని తెలిపాడు.ఈ కోళ్లు అత్యంత వేగంగా తమ శరీర బరువును పెంచుకోవడం వల్ల అధిక మాంసాన్ని కలిగి ఉంటాయని తెలిపారు.
ఈ కోళ్లతో కోళ్ల పరిశ్రమల నిర్వాహకులు అధిక లాభాలు పొందవచ్చని తెలిపాడు.
కానీ ఈ కోళ్ల ఆకారం కారణంగా ఇవి వివాదాస్పదంగానూ మారుతున్నాయి.ఈ కోళ్లు ఆరోగ్యానికి మంచివేనా అంటూ చాలామంది శాస్త్రవేత్తను విమర్శిస్తున్నారు.ఈకలు లేకపోవడం వల్ల ఈ కోళ్లు పరానా జీవులు, దోమల దాడులు, చర్మవ్యాధులు, వడదెబ్బలు లాంటి పరిస్థితుల కారణంగా ప్రమాదకరంగా మారుతాయని పలువురు విమర్శిస్తున్నారు.
అంతే కాకుండా ఈ కోళ్ల సంభోగ ప్రక్రియ కూడా ఇబ్బందికరంగా ఉంటుందని, ఈకలు లేని కారణంగా అవి సమతుల్యతను కొనసాగించ లేవని చెప్తున్నారు.ఈ విషయలపై శాస్త్రవేత్త కాహానర్ స్పందిస్తూ.
ఈ ఆరోపణలకు ఆధారాలు లేవని కొట్టిపడేస్తున్నాడు.తాను సాధారణ బాయిలర్ కోడిని ఆధారంగా చేసుకుని ఈ నేక్ట్ జాతిని సృష్టించాలని చెప్తున్నాడు.
ఇది జన్యుపరంగా మార్పు చెందిన చికెన్( Chicken ) కాదని 50 ఏళ్ల క్రితం సహజమైన కోడికి ఎలాంటి లక్షణాలు ఉంటాయో ఈ కోళ్లలో కూడా అవే ఉంటాయని పేర్కొన్నాడు.అయితే చాలామంది ఆరోగ్యంపై ఈ కోళ్లు ఎలాంటి ప్రభావం చూపుతాయో అని కాస్త ఆందోళన గాని ఉన్నారు.