కొత్త జెనెటిక్ క్రియేషన్.. త్వరలో ఈకలు లేని కోళ్ల మాంసం.. ఆరోగ్యానికి మంచిదేనా..!
TeluguStop.com
కోళ్ల గురించి చర్చించుకుంటే నాటు కోళ్లు, బాయిలర్ కోళ్లు ( Broiler Chicken )రెండు రకాలు ఉన్నాయని అందరికీ తెలిసిందే.
రెండు రకాల కోళ్ళకు శరీరాలపై ఈకలు ఉంటాయి.చికెన్ గా ఉపయోగించుకునే క్రమంలో శరీరంపై ఉండే ఈ కలను తీసేసి చికెన్ వండుకుంటారని మనందరికీ తెలిసిందే.
వాతావరణ పరిస్థితులలో జరుగుతున్న మార్పుల వల్ల అధిక ఉష్ణోగ్రతలకు తట్టుకోలేక కోళ్లు చనిపోతూ ఉండడంతో కోళ్ల పరిశ్రమల నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు.
"""/" /
అయితే ఈ సమస్యను పరిష్కరించడం కోసం ఇజ్రాయిల్(I Srael) జన్యు శాస్త్రవేత్త, పౌల్ట్రీ నిపుణుడు, జెరూసలేంలోని హిబ్రూ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ అవిగ్డోర్ కాహానర్( Avigdor Kahaner) అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే ఈకలు లేని కోళ్లను సృష్టించాడు.
ఈ కోళ్లను నేక్డ్ కోళ్లు గా నామకరణం చేశాడు.ఈ కోళ్లు అధిక ఉష్ణోగ్రతల వద్ద కూడా ఎటువంటి ఇబ్బందులకు గురికావని తెలిపాడు.
ఈ కోళ్లు అత్యంత వేగంగా తమ శరీర బరువును పెంచుకోవడం వల్ల అధిక మాంసాన్ని కలిగి ఉంటాయని తెలిపారు.
ఈ కోళ్లతో కోళ్ల పరిశ్రమల నిర్వాహకులు అధిక లాభాలు పొందవచ్చని తెలిపాడు. """/" /
కానీ ఈ కోళ్ల ఆకారం కారణంగా ఇవి వివాదాస్పదంగానూ మారుతున్నాయి.
ఈ కోళ్లు ఆరోగ్యానికి మంచివేనా అంటూ చాలామంది శాస్త్రవేత్తను విమర్శిస్తున్నారు.ఈకలు లేకపోవడం వల్ల ఈ కోళ్లు పరానా జీవులు, దోమల దాడులు, చర్మవ్యాధులు, వడదెబ్బలు లాంటి పరిస్థితుల కారణంగా ప్రమాదకరంగా మారుతాయని పలువురు విమర్శిస్తున్నారు.
అంతే కాకుండా ఈ కోళ్ల సంభోగ ప్రక్రియ కూడా ఇబ్బందికరంగా ఉంటుందని, ఈకలు లేని కారణంగా అవి సమతుల్యతను కొనసాగించ లేవని చెప్తున్నారు.
ఈ విషయలపై శాస్త్రవేత్త కాహానర్ స్పందిస్తూ.ఈ ఆరోపణలకు ఆధారాలు లేవని కొట్టిపడేస్తున్నాడు.
తాను సాధారణ బాయిలర్ కోడిని ఆధారంగా చేసుకుని ఈ నేక్ట్ జాతిని సృష్టించాలని చెప్తున్నాడు.
ఇది జన్యుపరంగా మార్పు చెందిన చికెన్( Chicken ) కాదని 50 ఏళ్ల క్రితం సహజమైన కోడికి ఎలాంటి లక్షణాలు ఉంటాయో ఈ కోళ్లలో కూడా అవే ఉంటాయని పేర్కొన్నాడు.
అయితే చాలామంది ఆరోగ్యంపై ఈ కోళ్లు ఎలాంటి ప్రభావం చూపుతాయో అని కాస్త ఆందోళన గాని ఉన్నారు.
వైరల్: జకార్తా వీధుల్లో నాగుపాము మాంసంతో వంటకాలు.. ధర తెలిస్తే దిమ్మతిరుగుద్ది!