సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోల కెరీర్ అనేది కొన్ని సినిమాల ద్వారా మలుపులు తిరుగుతూ ఉంటుంది.అయితే ఒకానొక స్టేజ్ లో వాళ్లకి హిట్లు అవసరం ఉన్న సమయంలో కొన్ని సినిమాలు వచ్చి వాళ్లకు బ్లాక్ బస్టర్ సక్సెస్ లను అందిస్తు వారిని టాప్ హీరోలుగా మారుస్తూ ఉంటాయి.
ఇక అలా కాల క్రమేణా సినిమా దశా మారుతున్న కొద్ది కొన్ని సినిమాలు వచ్చి వాళ్ళ క్రేజ్ ను మరింత పెంచుతూ ఉంటాయి.ఇక నాగార్జున( Nagarjuna ) కెరియర్ లో అలాంటి సినిమాలు ఏవో ఒకసారి మనం తెలుసుకుందాం.
ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో ఆయనకి పెద్దగా సక్సెస్ లు అయితే దక్కలేదు.ఇక ఎప్పుడైతే రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ‘శివ ‘ సినిమా( Shiva ) వచ్చిందో ఒక్కసారిగా నాగార్జున స్టార్ హీరోగా మారిపోయాడు.వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు.ఇక 1996వ సంవత్సరంలో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘నిన్నే పెళ్ళాడుతా ‘ సినిమా( Ninne Peladutta ) అతన్ని ఫ్యామిలీ ఆడియన్స్ కి, యూత్ కి బాగా దగ్గర చేసింది.
అలాగే రొమాంటిక్ హీరోగా కూడా ఆయనకి మంచి గుర్తింపును సంపాదించి పెట్టింది.ఇక ఈ సినిమా తర్వాత రాఘవేంద్ర రావు దర్శకత్వంలో ఆయన చేసిన ‘ అన్నమయ్య ‘ సినిమా( Annamayya ) భక్తిరస ప్రధానమైన సినిమా కావడంతో ఈ సినిమా ఫ్యామిలి ఆడియన్స్ అలాగే భక్తి భావాలు ఉన్నవాళ్ళకి నాగార్జునను బాగా దగ్గర చేసింది.
ఇక అప్పటినుంచి ఆయన వెనుతిరిగి చూడకుండా అన్ని రకాల ప్రేక్షకులను అలరిస్తూ సినిమాలు చేస్తూ సూపర్ సక్సెస్ లను అందుకుంటూ వస్తున్నాడు.ఇక ఈ మూడు సినిమాలు మాత్రమే ఆయన కెరీయర్ ను మార్చేసిన సినిమాలనే చెప్పాలి…ఇంకా ఆయనకి ఇండస్ట్రీ లో మంచి సక్సెస్ సినిమాలు ఉన్నప్పటికీ ఈ మూడు మాత్రం ఆయన్ని స్టార్ హీరోను చేశాయి…
.