ప్రపంచంలో అనేక వింతైన తెగలు ఉన్నాయి.వాటిలో ఒకటి జింబాబ్వేలోని( Zimbabwe ) కన్యెంబా ప్రాంతంలో నివసించే వడోమా తెగ.
( Vadoma Tribe ) ఈ తెగకు చెందిన ప్రజలకు మామూలుగా మనిషి కాళ్లకు ఉండే ఐదు వేళ్లకు బదులుగా రెండు వేళ్లు మాత్రమే ఉంటాయి.వారి కాళ్లు ఆస్ట్రిచ్ పాదాల మాదిరిగా ఉండటం వల్ల వారిని ఆస్ట్రిచ్ ప్రజలు అని కూడా పిలుస్తారు.
ఈ తెగ ప్రజలు ఎదుర్కొంటున్న ఈ అరుదైన జన్యుపరమైన రుగ్మతను ఎక్ట్రోడాక్టిలీ లేదా ఉష్ట్రపక్షి పాదాల సిండ్రోమ్( Ostrich Foot Syndrome ) అంటారు.ఈ పరిస్థితి కారణంగా వారు సరిగా నడవలేరు, చెప్పులు వేసుకోలేరు , ఇతర రోజువారీ పనులను సరిగా చేయలేరు.
ఈ తెగకు చెందిన ప్రజలలో ప్రతి నాల్గవ వ్యక్తి ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు.ఫలితంగా, వారు ఇతర వర్గాలలోని వ్యక్తులను వివాహం ( Marriage ) చేసుకోలేరు.ఈ తెగకు చెందిన వ్యక్తులను ఇతర వర్గాలలోని వ్యక్తులతో వివాహం చేసుకోవడంపై చట్టరీత్యా నిషేధం ఉంది.ఈ తెగ ప్రజల బాధను విని ప్రభుత్వాలు ఆదుకోవాలని చాలామంది కోరుతున్నాయి.
వారు ఈ తెగకు చెందిన ప్రజలకు చికిత్స, సహాయం అందించడానికి ప్రణాళికలు కూడా రూపొందిస్తున్నారు.
ఇకపోతే వడోమా తెగ మొత్తం జనాభా సుమారు 50,000 మంది. ఈ తెగ ప్రజలు చాలా సంప్రదాయవాదులు, తమ సొంత సంస్కృతి, ఆచారాలను పాటిస్తారు.వారు సాధారణంగా వేట, చేపలు పట్టడం, వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తారు.
తెగలు వారంతట వారే ఇతర తెగల నుంచి ప్రత్యేకంగా కనిపించడానికి భౌతికంగా మార్పులు చేసుకుంటారు.కానీ వడోమా తెగకు( Vadoma Tribe ) పుట్టుకతోనే ఇలాంటి ప్రత్యేకమైన భౌతిక లక్షణాలు వస్తాయి.