US Supreme Court : అబార్షన్ మాత్రలపై ఆంక్షలను పరిశీలిస్తోన్న యూఎస్ సుప్రీం కోర్టు..

యూఎస్ఎలో గర్భనిరోధక మాత్రల విషయంలో ప్రస్తుతం ఒక పెద్ద లీగల్ బాటిల్ నడుస్తోంది.తాజాగా అమెరికా సుప్రీం కోర్టు కూడా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంది.

 The Us Supreme Court Is Considering Restrictions On Abortion Pills-TeluguStop.com

ఈ అత్యున్నత న్యాయస్థానం అబార్షన్ల( Abortion access ) కోసం ఉపయోగించే మిఫెప్రిస్టోన్ అనే మాత్రల గురించి ఒక కీలకమైన కేసును విచారిస్తోంది.ఈ మాత్ర 2000 నుంచి అమెరికాలో అందుబాటులో ఉంది.

ఇప్పుడు దేశంలో గర్భాలను అంతం చేయడానికి అత్యంత సాధారణ పద్ధతిగా మారింది.తాజాగా, దిగువ కోర్టులు ఈ మాత్రలు జనాలు పొందకుండా ఆంక్షలు విధించాయి.

అయితే, అమెరికా సొలిసిటర్ జనరల్‌తో సహా చాలా మంది ఈ నిర్ణయానికి వ్యతిరేకతను చూపించారు.

Telugu Access, Methods, Mifepristone, Reproductive, Supreme-Telugu NRI

.రెండేళ్ల క్రితం, అమెరికా సుప్రీం కోర్టు( US Supreme Court ) అబార్షన్ ఒక రాజ్యాంగ హక్కు కాదని తీర్పు చెప్పింది.ఈ తీర్పు తర్వాత, కొన్ని సమూహాలు మిఫెప్రిస్టోన్ అనే గర్భనిరోధక మాత్రను నిషేధించాలని కోరుకుంటున్నాయి.

ఈ మాత్ర చాలా సంవత్సరాలుగా వినియోగంలో ఉంది ఇది చాలా సేఫెస్ట్ టాబ్లెట్ అని కూడా పేరు తెచ్చుకుంది.

Telugu Access, Methods, Mifepristone, Reproductive, Supreme-Telugu NRI

మరోవైపు టెక్సాస్‌లోని ఒక న్యాయమూర్తి మిఫెప్రిస్టోన్‌ను నిషేధించాలని ఆదేశించారు.అయితే, అప్పీల్ కోర్టు ఈ నిషేధాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది.మిఫెప్రిస్టోన్‌ను తయారుచేసే కంపెనీ, అధ్యక్షుడు బైడెన్ పరిపాలన ఈ నిషేధానికి వ్యతిరేకంగా ఉన్నారు.

ఈ కేసును సుప్రీం కోర్టుకు తీసుకువెళ్లారు.ప్రస్తుతానికి, సుప్రీం కోర్టు దిగువ కోర్టు నిర్ణయాన్ని నిలిపివేసింది, కాబట్టి మిఫెప్రిస్టోన్ ఇప్పటికీ అందుబాటులో ఉంది.

యూఎస్‌లో ఎక్కువ మంది అబార్షన్ల కోసం మాత్రలు వాడుతున్నారు.గత సంవత్సరం, మొత్తం అబార్షన్లలో 63% ఈ విధంగానే జరిగాయి.వాస్తవానికి, గర్భం దాల్చిన ఏడు వారాలలోపు మిఫెప్రిస్టోన్ మాత్రలను తీసుకోవచ్చు.2016లో దీన్ని 10 వారాలకు పొడిగించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube