US Supreme Court : అబార్షన్ మాత్రలపై ఆంక్షలను పరిశీలిస్తోన్న యూఎస్ సుప్రీం కోర్టు..

యూఎస్ఎలో గర్భనిరోధక మాత్రల విషయంలో ప్రస్తుతం ఒక పెద్ద లీగల్ బాటిల్ నడుస్తోంది.

తాజాగా అమెరికా సుప్రీం కోర్టు కూడా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంది.ఈ అత్యున్నత న్యాయస్థానం అబార్షన్ల( Abortion Access ) కోసం ఉపయోగించే మిఫెప్రిస్టోన్ అనే మాత్రల గురించి ఒక కీలకమైన కేసును విచారిస్తోంది.

ఈ మాత్ర 2000 నుంచి అమెరికాలో అందుబాటులో ఉంది.ఇప్పుడు దేశంలో గర్భాలను అంతం చేయడానికి అత్యంత సాధారణ పద్ధతిగా మారింది.

తాజాగా, దిగువ కోర్టులు ఈ మాత్రలు జనాలు పొందకుండా ఆంక్షలు విధించాయి.అయితే, అమెరికా సొలిసిటర్ జనరల్‌తో సహా చాలా మంది ఈ నిర్ణయానికి వ్యతిరేకతను చూపించారు.

"""/" / .రెండేళ్ల క్రితం, అమెరికా సుప్రీం కోర్టు( US Supreme Court ) అబార్షన్ ఒక రాజ్యాంగ హక్కు కాదని తీర్పు చెప్పింది.

ఈ తీర్పు తర్వాత, కొన్ని సమూహాలు మిఫెప్రిస్టోన్ అనే గర్భనిరోధక మాత్రను నిషేధించాలని కోరుకుంటున్నాయి.

ఈ మాత్ర చాలా సంవత్సరాలుగా వినియోగంలో ఉంది ఇది చాలా సేఫెస్ట్ టాబ్లెట్ అని కూడా పేరు తెచ్చుకుంది.

"""/" / మరోవైపు టెక్సాస్‌లోని ఒక న్యాయమూర్తి మిఫెప్రిస్టోన్‌ను నిషేధించాలని ఆదేశించారు.అయితే, అప్పీల్ కోర్టు ఈ నిషేధాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది.

మిఫెప్రిస్టోన్‌ను తయారుచేసే కంపెనీ, అధ్యక్షుడు బైడెన్ పరిపాలన ఈ నిషేధానికి వ్యతిరేకంగా ఉన్నారు.

ఈ కేసును సుప్రీం కోర్టుకు తీసుకువెళ్లారు.ప్రస్తుతానికి, సుప్రీం కోర్టు దిగువ కోర్టు నిర్ణయాన్ని నిలిపివేసింది, కాబట్టి మిఫెప్రిస్టోన్ ఇప్పటికీ అందుబాటులో ఉంది.

యూఎస్‌లో ఎక్కువ మంది అబార్షన్ల కోసం మాత్రలు వాడుతున్నారు.గత సంవత్సరం, మొత్తం అబార్షన్లలో 63% ఈ విధంగానే జరిగాయి.

వాస్తవానికి, గర్భం దాల్చిన ఏడు వారాలలోపు మిఫెప్రిస్టోన్ మాత్రలను తీసుకోవచ్చు.2016లో దీన్ని 10 వారాలకు పొడిగించారు.

వైరల్ వీడియో: కన్నెర్ర చేసిన ఏనుగు.. దెబ్బకు పర్యాటకుల కార్లు ధ్వంసం..