Ranjithame Vamsi Paidipally : 'రంజితమే' తెలుగు వర్షన్ కూడా అదుర్స్.. చార్ట్ బస్టర్ గ్యారెంటీ!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి జోసెఫ్ హీరోగా గ్లామరస్ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా ”వరిసు”.కోలీవుడ్ ప్రేక్షకులు ఈ సినిమా కోసం అవైటెడ్ గా ఎదురు చూస్తున్నారు.

 The Telugu Version Of Ranjithame From Varisu Movie, Rashmika Mandanna, Ranjitham-TeluguStop.com

తెలుగులో వారసుడు పేరుతో రిలీజ్ చేయబోతున్న ఈ సినిమాపై ఇక్కడ అంచనాలు అంతగా క్రియేట్ అవ్వలేదు.

తమిళ్ లో మాత్రం అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి.

టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఇద్దరు టాలీవుడ్ వారే కావడంతో ఇక్కడ కూడా అంచనాలు క్రియేట్ అవ్వాలి కానీ ఇది బైలింగ్వన్ అని చెప్పి తమిళ్ లోనే తెరకెక్కించడంలో ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకులు గుర్రుగా ఉన్నారు.

తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేయబోతున్న ఈ సినిమా నుండి ఇప్పటికే ప్రొమోషన్స్ స్టార్ట్ చేసారు.

గత కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయగా అది చార్ట్ బస్టర్ గా నిలిచి యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది.

ఇప్పుడు అదే ఫస్ట్ సింగిల్ ‘రంజితమే’ అనే సాంగ్ ను తెలుగు వర్షన్ లో రిలీజ్ చేసారు.తెలుగులో కూడా ఆకట్టుకునే విధంగా ఈ సాంగ్ ఉంది.

ఈ సాంగ్ తమిళ్ లో కంటే తెలుగులో ఏ మాత్రం తగ్గకుండా అదే రేంజ్ లో ఉంది.

అనురాగ్ కులకర్ణి పాడిన మేల్ వర్షన్ మరింత ఆకట్టు కుంటుంది.అలాగే రామజోగయ్య శాస్త్రి తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఇచ్చిన పదాలు ఆకట్టు కోవడంతో ఈ సాంగ్ తెలుగులో కూడా చార్ట్ బస్టర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.థమన్ అందించిన ఈ సాంగ్ అలరించడంతో మరోసారి ఇతడి పేరు మారుమోగి పోతుంది.

ఇక సంక్రాంతి కానుకగా 2023 జనవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎలా ఉంటుందో ఎలాంటి హిట్ అందుకుంటుందో వేచి చూడాల్సిందే.

https://youtu.be/FjjYlp4pm7E
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube