షర్మిలకు దక్కని క్రెడిట్ ? బోనస్ గా సెటైర్లు ? 

ఎన్నో ఆశలు, మరెన్నో అంచనాలతో తెలంగాణలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేశారు వైఎస్ షర్మిల.  పార్టీ పేరు ప్రకటించకుండానే జనాల్లోకి వెళ్లి , వారి నుంచి వచ్చిన రెస్పాన్స్ ఆధారంగా పార్టీ పేరును ప్రకటించాలని చూస్తున్నారు.

 The Low Response To Sharmilas Unemployment Initiative Is Satires On Social Media-TeluguStop.com

దీనికి రెండు నెలల గడువు సైతం విధించుకున్నారు.అప్పటిలోగా తెలంగాణలో ఉన్న ప్రధాన పార్టీల కు ముచ్చెమటలు పట్టించి , తమకు అవకాశాలు మెరుగుపరుచుకోవాలని షర్మిల చూసుకుంటున్నారు.

ముఖ్యంగా యువత ఎప్పటి నుంచో ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురు చూపులు చూస్తున్నా, తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో,  వారి నుంచి టిఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోంది.ఇప్పుడు అదే అంశంపై దృష్టి పెట్టి షర్మిల రాజకీయ మైలేజ్ పొందాలని చూశారు.

ఈ మేరకు నిరుద్యోగ సమస్యపై ఆమె నిరాహార దీక్షలకు సైతం దిగారు.కానీ కోవిడ్ నిబంధనలు కారణంగా ఆమెకు ఒక్కరోజు మాత్రమే దీక్ష చేసేందుకు పోలీసులు అనుమతి ఇవ్వడంతో,  మిగతా రెండు రోజులు లోటస్ పాండ్ లోని తన నివాసం నుంచి ఈ దీక్షను చేపట్టి , నిన్ననే ఆ దీక్షను విరమించారు.

అయితే ఈ దీక్ష ద్వారా ఆమెకు జనాల్లో రాజకీయ పరంగా ఏదైనా మైలేజ్ దక్కిందా అంటే పెద్దగా లేదనే చెప్పాలి.

పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలని , ఉద్యోగార్ధులకు ఉపయోగపడే విధంగా వయో పరిమితిని ఏడు సంవత్సరాలకు పెంచాలని , ఉద్యోగ క్యాలెండర్ ను టీఆర్ఎస్ ప్రభుత్వం విడుదల చేయాలని ఇలా అనేక డిమాండ్ లు వినిపించారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఘాటుగా విమర్శలు చేశారు.అయితే ఆమెకు మీడియాలో మాత్రం పెద్దగా ఫోకస్ అయితే దక్కలేదు.అలాగే నిరుద్యోగ యువత నుంచి స్పందన అంతంత మాత్రంగానే ఉంది.ప్రస్తుతం కరోనా భయం జనాల్లో ఎక్కువగా ఉండడం,  ఈ వైరస్ వ్యాప్తి వేగంగా విస్తరిస్తున్న క్రమంలో షర్మిల నిరసన కార్యక్రమానికి పెద్దగా స్పందన కనిపించలేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

 అలాగే యువతను ఆకట్టుకునే విధంగా ప్రసంగాలు లేకపోవడం, ఆమె మొదటి రోజు దీక్ష సందర్భంగా స్టేజిపై కోపంతో ఊగిపోతూ,  స్టేజి పైన ఉన్న వారందరినీ తిట్టి పోస్తూ ఆమె వ్యవహరించిన తీరు, అలాగే చేతికి తగిలిన దెబ్బకు బ్యాండేజ్ వేసుకోవడం పైన ఆమెను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తో పోలుస్తూ, సింపతీ డ్రామాలు ఆడుతున్నారని సోషల్ మీడియాలో ట్రోల్స్ నడిచాయి.అలాగే కెసిఆర్ స్పందించే వరకు తాను పచ్చి మంచినీళ్లు కూడా తాగను అంటూ మీడియా ముందు ఆమె మాట్లాడడం, దీక్ష సమయంలో ఆమె వాటర్ బాటిల్ తో నీళ్లు తాగడం ఎలా ఎన్నో విషయాలపై సోషల్ మీడియాలో షర్మిల పై సెటైర్లు పడ్డాయి.

షర్మిల నటనకు ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సిందే అంటూ ట్రోల్స్ నడిచాయి.ఎలా చూసుకున్నా షర్మిల సభకు ఆశించిన స్థాయిలో మైలేజ్ అయితే దక్కకపోగా సోషల్ మీడియాలో మాత్రం అభాసుపాలు అయ్యారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube