కొడుకు కోరిక తీర్చిన జూనియర్ ఎన్టీఆర్.. ఏమైందంటే..?

సాధారణంగా స్టార్ హీరోలు రోడ్లపైకి వచ్చే సమయంలో ఎక్కువగా కార్లలోనే వస్తుంటారు.

బైక్ పై ప్రయాణం చేస్తే ఫ్యాన్స్ గుర్తు పట్టే అవకాశంతో పాటు సెల్ఫీల కోసం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది.

కరోనా సమయంలో రోడ్లపైకి రావాలన్నా సెలబ్రిటీలు పెద్దగా ఆసక్తి చూపరు.అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం కొడుకు కోరిక తీర్చడం కోసం రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ పై రోడ్లపైకి వచ్చారు.

స్టార్ హీరో అయినప్పటికీ కొడుకుల చిన్నచిన్న కోరికలను నెరవేరుస్తూ గొప్ప తండ్రిగా ఎన్టీఆర్ పేరు తెచ్చుకుంటున్నారు.నిన్న జూనియర్ ఎన్టీఆర్ రెండో కొడుకు భార్గవ్ రామ్ తో రోడ్డుపై చక్కర్లు కొట్టారు.

ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.కొడుకు భార్గవ్ బైక్ పై వెళ్లాలని ఆశ పడటంతో ఎన్టీఆర్ ఈ విధంగా చేసినట్లు తెలుస్తోంది.

Advertisement

హైదరాబాద్ రోడ్లపై జూనియర్ ఎన్టీఆర్ చక్కర్లు కొట్టడం గురించి తెలిసి అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు.మరోవైపు ఎన్టీఆర్ ఇతర హీరోలకు భిన్నంగా కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు.

ఆర్‌ఆర్‌ఆర్ సినిమా తర్వాత గ్యాప్ రాకుండా ఏడాది ఒకటి లేదా రెండు సినిమాలు విడుదలయ్యేలా ఎన్టీఆర్ సినిమాలను ఎంపిక చేసుకుంటున్నారని తెలుస్తోంది.పాన్ ఇండియా కథలనే ఎంపిక చేసుకుంటూ ఆర్‌ఆర్‌ఆర్ తో వచ్చిన గుర్తింపును అలాగే కొనసాగించాలని జూనియర్ ఎన్టీఆర్ భావిస్తున్నారని సమాచారం. కొరటాల శివ సినిమా తరువాత ఎన్టీఆర్ నటించబోయే ప్రాజెక్ట్ కు సంబంధించి కూడా త్వరలో ప్రకటన రానుందని తెలుస్తోంది.

కొరటాల శివ సినిమా తరువాత ఎన్టీఆర్ నటించబోయే సినిమాకు సంబంధించి చాలా వార్తలు వైరల్ అవుతున్నా ఎన్టీఆర్ ఎవరి డైరెక్షన్ లో తరువాత సినిమాలో నటిస్తారో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement

తాజా వార్తలు