ఆ వైసీపీ ఎమ్మెల్యే ధైర్యం ఏంటి... ఎంపీ త‌ప్పు కోవాల్సిందేనా..!

తూర్పుగోదావ‌రి జిల్లాలో వైసీపీ రాజ‌కీయాలు దూకుడుగా ఉన్నాయి.ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న విధానాల‌కు భిన్నంగా ఇప్పుడు నాయ‌కులు బ‌య‌ట ప‌డుతున్నారు.

 That Ysrcp Mp Having Full Dareness.. Will That Mp Move On?,ysrcp,pilli Subhash C-TeluguStop.com

నిన్న మొన్న‌టి వ‌ర‌కు తెర‌చాటున ఉండి చ‌క్రం తిప్పుతున్న నాయ‌కులు ఇప్పుడు బ‌హిరంగ విమ‌ర్శ‌ల‌కు, వ్య‌క్తిగ‌త దాడుల‌కు దూష‌ణ‌ల‌కు కూడా దిగుతున్నారు.దీంతో ప‌రిస్థితి చేయిదాటిపోతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

తాజాగా మాజీ మంత్రి, ప్ర‌స్తుత రాజ్య‌స‌భ స‌భ్యుడు పిల్లి సుభాష్ చంద్ర‌బోస్‌కేంద్రంగా రాజ‌కీయాలు మ‌రింత హీటెక్కాయి.కాకినాడ సిటీ ఎమ్మెల్యే, జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితుడు, సాక్షి బోర్డు డైరెక్ట‌ర్ల‌లో ఒక‌రు అయిన ద్వారం పూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి ఏకంగా బోసుపై విరుచుకుప‌డ‌డం, …కొడ‌క‌.

అంటూ.దూష‌ణ‌ల‌కు దిగ‌డం రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది.

నిజానికి గ‌త కొన్నాళ్లుగా ద్వారంపూడి తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు.పార్టీలో తాను సీనియ‌ర్‌న‌ని, మిగిలిన వారంతా త‌ర్వాత వ‌చ్చిన వారేన‌ని ఆయ‌న త‌రచుగా చెబుతున్నారు.అంతేకాదు, మంత్రి క‌న్న‌బాబును కూడా ఆయ‌న టార్గెట్ చేసుకుని దూసుకుపోతున్నారు.ఈ క్ర‌మంలోనే మంత్రికి తెలియ‌కుండానే అనేక కార్య‌క్ర‌మాల‌కు ప్రారంభోత్సవాలు చేస్తున్నారంటూ.

వార్త‌లు వ‌స్తున్నాయి.త‌న‌కు ద‌క్కాల్సిన మంత్రి ప‌ద‌విని క‌న్న‌బాబు కొట్టేశార‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్న‌ట్టు ఆయ‌న వ‌ర్గం పేర్కొంటోంది.

ఇదిలావుంటే.వైసీపీలోని ఓ వ‌ర్గం నేత‌లు ద్వారంపూడితో చేతులు క‌లిపారు.మంత్రులు స‌హా.శెట్టిబ‌లిజ వ‌ర్గాన్ని వ్య‌తిరేకించే కాపు నాయ‌కులు.

ద్వారంపూడితో చేతులు క‌లిపిన‌ట్టు తెలుస్తోంది.అందుకే రాజ‌కీయంగా ఈ జిల్లాలో వైసీపీ నేతలు ఏం చేయాల‌న్నా హ‌డలి పోతున్నారు.

ముఖ్యంగా టిక్కో ఇళ్ల‌లో అవినీతిపై కొన్నాళ్లుగా ఇక్క‌డ చ‌ర్చ జ‌రుగుతోంది.అయితే.

ఇప్పుడు బోస్ నేరుగా ద్వారంపూడి పేరు చెప్ప‌కపోయినా.త‌న‌కు కూడా ఫోన్లు చేసి ఫిర్యాదులు చేస్తున్నార‌ని, వైసీపీ ఎమ్మెల్యేలే దీనివెనుక ఉన్నార‌ని, కాకినాడ‌లో ఇదే జ‌రుగుతోంద‌ని చెప్ప‌డం వివాదానికి కేంద్రంగా మారింది.

వాస్త‌వానికి టీడీపీ హ‌యాంలోనే అవినీతి జ‌రిగింద‌ని కొన్నాళ్ల కింద‌ట బోసే ఆరోపించారు.

Telugu Ap, Chandrasekhar, Latest, Pillisubhash, Ysrcp-Political

కానీ, ఇప్పుడు వ్యూహాత్మ‌కంగా ద్వారంపూడికి చెక్ పెట్టేలా వ్యాఖ్య‌లు చేయ‌డం.ఆయ‌న‌పై ఉన్న అసంతృప్తిని వెళ్ల‌గ‌క్కేందుకు ప్ర‌య‌త్నించ‌డం వంటివి చ‌ర్చ‌నీయాశంగా మారాయి.మొత్తానికి తూర్పు వైసీపీలో నేత‌లు ఇప్ప‌టికే విడిపోయి.

ఎవ‌రికి వారు రాజ‌కీయాలు చేసుకుంటున్నారు.ఇప్పుడు ఇవి మ‌రింత తీవ్ర‌స్థాయికి చేరుకోవ‌డంతో ముందు ముందు ఎలాంటి ప‌రిణామాలు ఎదుర‌వుతాయోన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

మ‌రి ఏం జ‌రుగుతుందో.తాజా ప‌రిస్థితిపై జ‌గ‌న్ ఎలా నిర్ణ‌యిస్తారో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube