తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ముఖ్యమైన పాత్రలను పోషిస్తూ తమిళ్ ఇండస్ట్రీ లో తన కంటు ఒక మంచి గుర్తింపును ఉంచుకున్న హీరో కార్తికేయన్ …ఈయన చేసిన సినిమాలు వరుసగా గా తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి.అందుకే ఆయన సినిమాలకి ఇక్కడ కూడ మంచి మార్కెట్ ఉందనే చెప్పాలి.
ఈయన చేసిన వరుణ్ డాక్టర్ ,రేమో, ప్రిన్స్ లాంటి సినిమాలు తెలుగు లో మంచి విజయాలను అందుకున్నాయి.అయితే వరుసగా తమిళ్ డైరెక్టర్ లతో సినిమాలు చేసే శివ కార్తికేయన్ ప్రిన్స్ సినిమా కోసం అనుదీప్ డైరెక్షన్( Anudeep kv ) లో నటింరిగించడం జది.
ప్రస్తుతం మళ్లీ ఒక తెలుగు డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.ఆయన ఎవరు అంటే రీసెంట్ గా హిడింబ సినిమాతో ఒక మంచి విజయాన్ని అందుకున్న అనిల్ కన్నేగంటి డైరెక్షన్ లో శివ కార్తికేయన్( Sivakarthikeyan ) ఒక సినిమా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇది బైలింగ్వల్ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్నట్టుగా సమాచారం అందుతుంది.అయితేఆయన చెప్పిన కథ శివ కార్తికేయన్ కి బాగా నచ్చడంతో ఆయన అనిల్ అన్న కన్నెగంటి కి డేట్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది.
ఇక ఇప్పటికే అనుదీప్ డైరెక్షన్ లో తెలుగులో ప్రిన్స్( Prince ) సినిమా చేసిన కార్తికేయ మరో తెలుగు డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడు అనే విషయం తెలిసిన తర్వాత తెలుగు అభిమానులు కూడా శివ కార్తికేయ మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.ఎందుకంటే తమిళ్ డైరెక్టర్లు ఆయన కోసం మంచి స్టోరీలను రెడీ చేసినప్పటికీ తమిళ్ లో కల్సినిమలు చేస్తూనే, తెలుగు లో కూడా మంచి స్టోరీలు వచ్చినప్పుడు వాటిని వదులుకోకుండా తెలుగు డైరెక్టర్లను కూడా ఎంకరేజ్ చేస్తూ వస్తున్నాడు.ఆయన మంచి నటుడు అనే విషయం ఆయన చేసిన సినిమాలను చూస్తే మనకి అర్థమవుతుంది.అయితే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్ళడానికి ఇంకా కొన్ని రోజులు టైం అయితే పడుతుంది.
అలోపు శివ కార్తికేయన్ ఒప్పుకున్న తమిళ్ ప్రాజెక్టులు అన్నీ కూడా పూర్తి చేస్తారని తెలుస్తుంది…
.