ఆ గుమ్మడికాయ రూ.47వేలు ధర పలుకుతోంది.. ఎందుకంటే?

సోషల్ మీడియా విస్తృతి పెరుగుతున్న వేళ దేశం నలుమూలలా ఎలాంటి వింతలూ విడ్డురాలు తెలిసినా ఇట్టే తెలిసిపోతోంది.సదరు విషయాలు కొన్ని ఫన్నీగావుంటే, మరికొన్ని విడ్డురంగా ఉంటాయి.

 That Pumpkin Is Priced At Rs. 47 Thousand Because , Pumpkin, Action, 47 Thousand-TeluguStop.com

ఇంకొన్ని ఒకింత ఆశ్చర్యగొలిపేవిగా ఉంటాయి.తాజా విషయం అలాంటిదే.తాజాగా ఓ గుమ్మడికాయ రూ.47వేలు ధర పలికి స్థానికులను ఆశ్చర్య పరిచింది.ఏంటి, ఆశ్చర్యపోతున్నారా? ఒక గుమ్మడికాయ ఆ ధర పలకడమేమిటి? మీ పిచ్చికాకపోతే! అని అనుకుంటున్నారా? మీరు విన్నది నిజమే.

గుమ్మడి కాయ బరువు సుమారు 5 కేజీలు.

అయితే ఏంటి గొప్ప అని అనుకోకండి, దానికి పెద్ద స్టోరీ వుంది.అది ధర రూ.47 వేలు.విషయంలోకి వెళితే, కేరళ ఇడుక్కిలో చెమ్మన్నార్​ గ్రామం ఒకటి వుంది.

అది పూర్తిగా కొండ ప్రాంతంలో ఉంది.అయితే ఇపుడు అక్కడ ఓనం సంబరాలు నడుస్తున్నాయి కదా.పండగ సందర్భంగా నిర్వహించిన బహిరంగ వేలంలో 5కిలోల గుమ్మడికాయ భారీ ధర పలికింది.

అవును.ఆ గుమ్మడికాయని ఏకంగా రూ.47 వేలకు వేలం పాడాడు సదరు వ్యక్తి.సాధారణంగా ఓనం పండగ సమయంలో నిర్వహించే వేలంలో పొట్టేలు, కోళ్లు వేల రూపాయలు పలకడం చాలా సాధారణమైన విషయం.అయితే ఈ సారి వేలంలో మాత్రం గుమ్మడికాయ భారీ ధర పలకడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది.

ఇక్కడ మరో ట్విస్ట్ చెప్పమంటారా? వేలం పాట నిర్వహకులకు దాన్ని ఎవరో అక్కడ ఫ్రీగా ఇచ్చారట.అలా ఫ్రీగా ఇచ్చిన గుమ్మడికాయ ఇంత ధర పలకడం వల్ల వేలం నిర్వాహకులు సంతోషపడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube