ఎన్టీఆర్ ఆ నటుడిని తుత్థర్ రెడ్డి అని పిలుస్తాడా.. షాకింగ్ విషయాలు రివీల్!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ షూటింగ్ సెట్స్ లో సరదాగా ఉంటారనే సంగతి తెలిసిందే.తారక్ చాలా యాక్టివ్ గా ఉంటారని సరదాగా జోకులు వేస్తారని ఆయనతో పని చేసిన చాలామంది చెబుతారు.

 Actor Ramesh Reddy Comments About Junior Ntr Goes Viral In Social Media Details,-TeluguStop.com

ప్రముఖ నటుడు, రచయిత రమేష్ రెడ్డి తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తారక్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.పోసాని కృష్ణమురళిగారు, నేను చాలా క్లోజ్ అని ఆయన తెలిపారు.

పోసాని కృష్ణమురళి గారు బాగా బిజీగా ఉన్న సమయంలో కొన్ని సినిమాలకు పని చేసే అవకాశం నాకు ఇచ్చేవారని ఆయన చెప్పుకొచ్చారు.గబ్బర్ సింగ్ లో బ్యాంక్ మేనేజర్ పాత్ర చేయమని హరీష్ శంకర్ సూచించడంతో ఆ పాత్ర చేశానని ఆయన వెల్లడించారు.

ఆ సినిమాతో చిన్నగా నటుడిగా కెరీర్ ను మొదలుపెట్టానని రమేష్ రెడ్డి అన్నారు.నవ్వులాట సినిమా నాకు మంచి పేరు వచ్చిందని ఆయన కామెంట్లు చేశారు.

ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాకు నంది అవార్డ్ వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు.

Telugu Ramesh Reddy, Harish Shankar, Gabbar Singh, Ntr, Tuttharth Reddy, Writerr

అద్భుతమైన కథలు ఇందిరా నగర్, కృష్ణానగర్ లో ఉన్నాయని ఆయన తెలిపారు.రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలకు వరుసగా పని చేశామని ఆయన తెలిపారు.నన్ను తారక్ తుత్థర్ రెడ్డి అని పిలుస్తాడని తారక్ తొలి సినిమాకు మేమే డైలాగ్ రైటర్స్ అని ఆయన చెప్పుకొచ్చారు.

నేను టకటకా మాట్లాడతానని అందుకే తారక్ అలా పిలుస్తారని ఆయన తెలిపారు.

Telugu Ramesh Reddy, Harish Shankar, Gabbar Singh, Ntr, Tuttharth Reddy, Writerr

మంచి సినిమాలకు రాశారని మార్కెటింగ్ చేసుకోవాలని హరీష్ శంకర్ సూచించారని ఆయన చెప్పుకొచ్చారు.హరీష్ శంకర్ నాకు బాగా హెల్ప్ చేశారని ఆయన తెలిపారు.రైటర్ గా సక్సెస్ కావాలంటే పార్టీలలో కూడా ఉండాలని హరీష్ శంకర్ చెబుతారని ఆయన చెప్పుకొచ్చారు.

ఒక కథ నచ్చలేదంటే నా ముఖంలోనే తెలుస్తుందని ఆయన తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube