1. నాట్స్ ఫుడ్ డ్రైవ్
ఉత్తర అమెరికా తెలుగు సంఘం ( నాట్స్ ) ఫాదర్స్ డే సందర్భంగా నాట్స్ చికాగో విభాగం పేదల ఆకలి తీర్చేందుకు ఫుడ్ డ్రైవ్ చేపట్టింది.2500 డాలర్ల విలువైన ఆహారాన్ని, నిత్యావసరాలను నాట్స్ చికాగో విభాగం సేకరించి వీటిని చికాగోలో పేదల ఆకలి తీర్చే సంస్థ హోస్ట్ హౌస్ కి అందించింది.
2.ఏపీలో నాట్స్ ఉచిత కంటి వైద్య శిబిరం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్ ) గుంటూరు జిల్లాలోని పెదనందిపాడు ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించింది.ఈ కార్యక్రమానికి తానా అధ్యక్షుడు బాపయ్య చౌదరి నూతి , నాట్స్ బీవొడి చైర్ వుమెన్ అరుణ గంటి ఆధ్వర్యంలో ఈ శిబిరం నిర్వహించారు.
3.అమెరికాలో ప్రారంభమైన శ్రీనివాస కళ్యాణం
అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలో ప్రవాసాంధ్ర తెలుగు సొసైటీ తో కలిసి ఆదివారం తెల్లవారుజామున శ్రీనివాస కళ్యాణం ను టీటీడీ కన్నుల పండుగ గా నిర్వహించింది.
4.సింగపూర్ లో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు
సింగపూర్ లో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను సింగపూర్ లోని సివిల్ సర్వీస్ క్లబ్ టేసన్ సోన్ లో ఘనంగా ప్రారంభం అయ్యాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి దేవినేని ఉమ, కేఎస్ జవహర్ పాల్గొన్నారు.
5.యూ ఏఈ తెలుగు అసోసియేషన్ అధ్వర్యంలో టాలెంట్ షో
యూఏఈ తెలుగు అసోసియేషన్ అధ్వర్యంలో మదర్ అండ్ చైల్డ్ టాలెంట్ షో నిర్వహించారు.మంతెన అమెరికన్ పాఠశాల ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరిగింది.
6.ఘనంగా TAS 20 వ వార్షికోత్సవ సంబరాలు
తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్ ఏర్పడి రెండు దశాబ్దాలు పూర్తవుతున్న సందర్భంగా సంస్థ కార్యనిర్వహణాధికారులు ఆర్బాటంగా 20వ వార్షికోత్సవ వేడుకలను నిర్వహించారు.
7.ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు కుమార్తె ఉపాధ్యక్షురాలిగా ప్రమాణం
ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టీ కుమార్తె సారా డ్యూటెర్టీ ఆ దేశ ఉపాధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు.
8.అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం
అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి వాషింగ్టన్ డిసిలో ఓ గుర్తు తెలియని దుండగుడు కాల్పులు జరపడంతో ఓ బాలుడు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు.
9.ఇథియోపియా లో జాతుల ఘర్షణ .230 మంది మృతి
తూర్పు ఆఫ్రికాలోని ఇథియోపియా లో జాతుల ఘర్షణ తలెత్తింది.ఈ ఘటనలో 230 మంది మృతి చెందారు.
10.యూకే ఆర్మీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
యూకే ఆర్మీ చీఫ్ గా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన పాట్రిక్ స్టాండర్డ్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆ దేశ ఆర్మీ ని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన రష్యా సైన్యంతో పోరాడెందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.