తెలుగమ్మాయి అంజలి కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకుంది.అక్కడ గడచిన పదేళ్లుగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి.
స్టార్ హీరోలకు జోడీగా నటించిన విషయం తెల్సిందే.ఈ అమ్మడు తెలుగు లో కూడా పలు సినిమా ల్లో నటించింది కాని టాలీవుడ్ లో తెలుగు అమ్మాయి అవ్వడం వల్లో లేదా మరేంటో కాని సక్సెస్ లు దక్కినా స్టార్ అవ్వ లేక పోయింది.
స్టార్ హీరోయిన్ గా కోలీవుడ్ లో దూసుకు పోతున్న సమయంలో టాలీవుడ్ లో ఈమెకు ఆఫర్లు అంతంత మాత్రంగానే వస్తున్నాయి.ఈ సమయంలో ఆమె నుండి తెలుగు మరియు తమిళంలో కొన్ని సినిమాలు వస్తున్నాయి.
ఆ సినిమా ల్లో అంజలి లుక్ ను చూసి అంతా కూడా ముక్కున వేలేసుకుంటున్నారు.ఎందుకంటే ఆ సినిమా ల్లో అంజలి చాలా సన్నగా నాజుకుగా కనిపిస్తుంది.
తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ ఫొటోల్లో కూడా ఆమె చాలా సన్నగా కనిపిస్తున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం.
ఇంత సన్నగా అవ్వడానికి కారణం టాలీవుడ్ ల్లో అవకాశాల కోసమా అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే మరి కొందరు మాత్రం అంజలి కష్టానికి ఫిదా అవుతున్నారు.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా సమయంలో అంజలి ఎంత బరువు ఉండేది.ఇప్పుడు ఎంత బరువు తగ్గింది అనే లెక్కలు వేసుకుంటే ఆమె పట్టుదలకు హ్యాట్సాప్ చెప్పాల్సిందే.
సినిమాల్లో అభిమానులను మెప్పించాలి.ఆకట్టుకోవాలనే ఉద్దేశ్యంతో ఆమె పడే కష్టంకు ఆఫర్లు వెళ్లువెత్తాల్సిందే అని అభిమానులు కోరుకుంటున్నారు.
తమిళంలో ఏస్థాయిలో ఆమెకు అభిమానులు ఉన్నారో తెలుగు లో కూడా అదే స్థాయి అభిమానులు ఉన్నారు.కాని టాలీవుడ్ మేకర్స్ ఆమెకు కమర్షియల్ పాత్రలు అంటే హీరోలకు జోడీగా అవకాశాలు తక్కువ ఇస్తున్నారు.
అయినా కూడా ఆమె అంది వచ్చిన అవకాశాలతో తెలుగు వారిని కూడా ఎంటర్ టైన్ చేస్తూ వస్తోంది.