ఛలో, భీష్మ, పుష్ప వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఆమె గురించి అందరికి తెలుసు.
నేషనల్ క్రష్ గా ప్రేక్షకుల చేత పిలిపించుకుంటూ రష్మిక మందన్న ( Rashmika Mandanna ) పాన్ ఇండియన్ వ్యాప్తంగా అన్ని భాషల్లో వరుస అవకాశాలను అందుకుంటూ దూసుకు పోతుంది.
అయితే తాజాగా ఈ భామకు ఒక సమస్య ఎదురైన విషయం తెలిసిందే.
సోషల్ మీడియాలో తన డీప్ ఫేక్ వీడియో ఒక్కసారిగా వైరల్ అయ్యింది.దీంతో రష్మిక షాక్ అయ్యింది.
ఈమెకు ఊహించని కష్టం ఎదురవడంతో ఆ వీడియోను ఖండిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఇండస్ట్రీ సహా ఫాలోవర్స్ నుండి కూడా సపోర్ట్ లభించింది.
ప్రముఖులు సైతం ఈ విషయాన్నీ ఖండిస్తూ ఈమెకు మద్దతుగా నిలుస్తున్నారు.ఇక తాజాగా ఈమెకు మద్దతుగా తెలుగు సినిమా జర్నలిస్ట్ అసోసియేషన్( Telugu Cinema Journalist Association ) వారు స్పందిస్తూ ఆమెకు అండగా కేసు ఫైల్ చేసి ఆమెకు ధైర్యం చెప్పారు.దీంతో ఈ విషయంపై ఈమె వారి మద్దతుకు ప్రత్యేకంగా ధన్యవాదములు చెబుతూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది.
తనకు మద్దతుగా నిలిచినా జర్నలిస్టులకు( journalists ) హృదయ పూర్వకంగా ధన్యవాదాలు చెబుతున్నాను అంటూ ఈమె చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అయ్యింది.ఏది ఏమైనా ఏఐ టెక్నాలిజీ మంచి కంటే చెడు పనులకు ఎక్కువగా వాడుతూ ఆడవారిని మానసికంగా క్షోభకు గురి చేస్తున్నారు.మరి వీరిపై ప్రభుత్వాలు ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి.