సింగరేణి ఎన్నికలకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఈ మేరకు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను ధర్మాసనం రిజెక్ట్ చేసింది.
అయితే సింగరేణి ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ హైకోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో పిటిషన్ ను రిజెక్ట్ చేసిన న్యాయస్థానం ఎన్నికలు నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది.
దీంతో ఈనెల 27వ తేదీన సింగరేణి కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలు యథావిధిగా జరగనున్నాయి.