టిడిపి అధినేత చంద్రబాబుకు పెద్ద చెక్కే వచ్చి పడింది.ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో పార్టీలోకి విస్తృతంగా చేరికలను ప్రోత్సహించాలని బాబు నిర్ణయించుకున్నారు.
ఈ మేరకు ఇతర పార్టీలోని అసంతృప్త నేతలను టిడిపి వైపు తీసుకొచ్చి ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ విషయంలో సక్సెస్ అవుతున్నారు.
అయితే అలా వచ్చి జరగబోతున్న నేతలకు ప్రస్తుతం టిడిపిలో కొనసాగుతున్న నేతల నుంచి సరైన సహకారం లభించకపోవడం,
వారిని పార్టీలో చేర్చుకుంటే ఊరుకునేది లేదు అంటూ హెచ్చరికలు చేయడం , ఈ వ్యవహారాలపై పార్టీలో గందరగోళం వంటివి ఇప్పుడు టిడిపిలో సంచలనంగా మారింది.ప్రస్తుతం చంద్రబాబు 15, 16 ,17 తేదీల్లో ఉభయగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు.
ఈ సందర్భంగా 16వ తేదీన మహాసేన రాజేష్ టిడిపిలో చేరేందుకు ముహూర్తం పెట్టుకున్నారు.ఆయన చంద్రబాబు సమక్షంలోనే టిడిపిలో చేరబోతున్నారు అనే వార్తలు వచ్చాయి.
దీనిని రాజేష్ కూడా ధ్రువీకరించారు.అయితే అనూహ్యంగా తన నిర్ణయాన్ని మార్చుకుని టిడిపిలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

మహాసేన రాజేష్ ని టిడిపిలో చేర్చుకోవద్దని , అలా చేర్చుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని చంద్రబాబు కు టిడిపి దళిత ఐక్య వేదిక పేరుతో లేఖ విడుదలైంది.ఈ లేఖ సోషల్ మీడియాలోను వైరల్ గా మారింది.రాజేష్ ను కనక పార్టీలో చేర్చుకుంటే .పార్టీలో దళిత నాయకులందరూ మూకుమ్మడి గా రాజీనామా చేస్తామని లేఖలో హెచ్చరించారు.తమ రాజీనామా లేఖలను కూడా అంగీకరించాల్సి ఉంటుందని చంద్రబాబుకు లేఖలో సూచించారు.

వైఎస్సార్సీపీ లో ఉండగా మహాసేన రాజేష్ అనేక అసభ్య విమర్శలు చేశారని , ఆయన కారణంగానే టిడిపికి చాలామంది దళితులు దూరమయ్యారని, మొదట్లో ఆయన వైసీపీలో ఉన్నారని, తర్వాత జనసేనకు వెళ్లేందుకు ప్రయత్నించారని ఇప్పుడు టిడిపిలోకి ఏదో ఆశించే వస్తున్నారనే ఆరోపణలు టిడిపి దళిత ఐక్య వేదిక నాయకులు చేస్తున్నారు.దీంతో ఈ వ్యవహారం చంద్రబాబుకి ఇబ్బందికరంగా మారింది.