చేపల్ని ఇలా తింటే.. మీ జబ్బులు పరార్‌!

ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది నాన్‌ వెజ్‌ ప్రియులే ఉన్నారు.వీటి వల్ల శరీరానికి అవసరమైన విటమిన్స్, మినరల్స్‌ అందుతాయని చెబుతారు.

 Take Weekly Twice Fishes, That Will Protect You From The Diseases.antioxidants,-TeluguStop.com

ఈ మాంసాహారంలో చేపలకు ఓ ప్రత్యేకత ఉంది.ఇందులో విటమిన్స్, ఒమేగా –3 ఫ్యాటీ యాసిడ్లు అధిక మోతాదులో ఉంటాయి.

ఇవి మన శరీరానికి ఎంతో అవసరం.అందుకే అన్ని మాంసాహారాల్లో చేపలకు ఇంత ప్రత్యేకత ఉంది.

అదేవిధంగా వీటి వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.అది ఎలానో తెలుసుకుందాం.

మన పూర్వీకులు కూడా చేపలకు చాలా ప్రాధాన్యతే ఇచ్చారు.గర్భం దాల్చినప్పటి నుంచే చేపల్ని తినడం వల్ల బిడ్డ మెదడు పనితీరు మెరుగ్గా పనిచేస్తుందని అంటారు.

Telugu Fishes, Benifits, Heart Diseases-Telugu Health

అలాగే సౌందర్యానికి సంబంధించిన విషయానికి వస్తే చేపలు తరచూ తినడం వల్ల జుట్టు కుదుళ్లు బలపడి, ఊడకుండా ఉంటుందని నిపుణులు సైతం చెబుతారు.ఇక రోగాల బారిన పడిన వారు కూడా చేపలను ఎక్కువ శాతం తీసుకుంటే కొన్ని ప్రమాదాలను వారు అధిగమించే అవకాశం ఉంటుంది.అందులో ప్రత్యేకంగా గుండె సంబందిత వ్యాధులతో బాధపడుతున్నవారు చేపలు తింటే ఫ్యాటీ యాసిడ్లు పెరిగి వారికి రక్షణ లా సహయపడుతుంది.ఎందుకంటే వీటిలో రోగాన్ని నిరోధించే శక్తి ఉంటుంది.

సాధారణంగా మనం వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే సమతూల్య ఆహారం తీసుకోవాలంటారు.దీనివల్ల మన శరీరానికి అవసరమయ్యే పోషకాలు అందుతాయి.

మారుతున్న కాలం పెరుగుతున్న రోగాల దృష్ట్యా ఆహారంలో చేపల స్థాయిని పెంచాలని ఇటీవల కొన్ని అధ్యయనాలు తెలుపుతున్నాయి.కనీసం వారానికి రెండు సార్లు చేపలు తినాల్సిందేనని ఈ స్టడీస్‌ నొక్కి చెబుతున్నాయి.

ముఖ్యంగా గుండె జబ్బుతో బాధపడుతున్నవారు ఈ ప్రమాదం బారి నుంచి దూరంగా ఉండవచ్చు.మెక్‌ మాస్టర్‌ యూనివర్శిటీ ప్రొఫెసర్‌ ఆండ్రూ మెంటీ వీరిపై ప్రత్యేక పరిశోధన చేశారు.

Telugu Fishes, Benifits, Heart Diseases-Telugu Health

దాదాపు రూ.1,92,000 మందిపై ఈ పరిశోధన చేశారు.నాలుగు దశల్లో అధ్యయనం చేశారు.గుండె జబ్బు ప్రమాదం ఎక్కువ ఉన్నవారు ఒమేగా ఫ్యాటీ యాసిడ్డు ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల సీవీడీ నుంచి వారికి సంరక్షణ లభిస్తుందని తెలిపారు.

అందులో ఎక్కువ ప్రాణంతకంగా ఉన్నవారితో పోలిస్తే మధ్యస్థ ప్రమాదం ఉన్నవారికి ఆరోగ్య ప్రయోజనాలు అధికంగా ఉంటుంది.అందుకే తరచూ చేపల్ని తినడం వల్ల వారి జబ్బులు ప్రాణంతకంగా మారకుండా జాగ్రత్త తీసుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

అంటే చేపల్ని మనం ఇష్టపడి మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అవి మనకు తిరిగి ఆరోగ్యాన్ని అందించి, గుండెకు రక్షణ కవచంలా పనిచేస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube