పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ సిద్ధం అవుతోంది.ఈ మేరకు రాష్ట్రంలోని లోక్ సభ స్థానాలకు ఇంఛార్జులుగా మంత్రులకు కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించింది.
ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రెండేసి లోక్ సభ స్థానాల బాధ్యతలను స్వీకరించారు.
చేవెళ్ల, మహబూబ్ నగర్ ఇంఛార్జ్ గా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారించనున్నారు.
ఆదిలాబాద్, మహబూబాబాద్ ఇంచార్జ్ గా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉండనున్నారు.అలాగే ఖమ్మం ఇంఛార్జ్ గా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, నల్గొండ ఇంఛార్జ్ గా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కరీంనగర్ ఇంఛార్జ్ గా పొన్నం ప్రభాకర్, నాగర్ కర్నూల్ ఇంఛార్జ్ గా జూపల్లి కృష్ణారావు, పెద్దపల్లి ఇంఛార్జ్ గా శ్రీధర్ బాబు ఉండనున్నారు.
అదేవిధంగా వరంగల్ ఇంఛార్జ్ గా కొండా సురేఖ, భువనగిరి ఇంఛార్జ్ గా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బాధ్యతలు నిర్వర్తించనున్నారు.