తమిళ తలైవా రజినీకాంత్ గురించి ఎంత చెప్పినా తక్కువే.బస్ కండక్టర్ గా తన ప్రస్థానం మొదలుపెట్టిన ఈయన సినిమాలపై మక్కువతో తన స్నేహితుల సహాయంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నేడు చిత్ర పరిశ్రమ గర్వించే స్థాయిలో ఈయన ఉన్నారని చెప్పాలి.
రజినీకాంత్ చిత్ర పరిశ్రమలో ఎంతో ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తిత్వం అతనిది అని చెప్పాలి.ఇలా రజనీకాంత్ నేడు ఈ స్థాయిలో విజయాన్ని అందుకున్నారంటే ఆ విషయం వెనుక ఎన్నో చేదు సంఘటనలు కూడా ఉన్నాయని చెప్పాలి.
ఇకపోతే చెన్నై రైల్వే స్టేషన్లో తనకు జరిగినటువంటి ఓ సంఘటన గురించి ఈ సందర్భంగా రజనీకాంత్ చెబుతూ ఎమోషనల్ అయ్యారు.తన స్నేహితుడు తనను మద్రాసుకి వెళ్లి సినిమాలలో ప్రయత్నాలు చేయమని చెప్పారట అదే సమయంలో తన స్నేహితుడు టికెట్టు కొని కొంత డబ్బును కూడా తనకు ఇచ్చి పంపించారని తెలిపారు.
అయితే చివరికి చెన్నై రైల్వే స్టేషన్లో దిగినప్పుడు అందరూ టికెట్ కలెక్టర్ కి టికెట్ చూపించి వెళ్తుండగా తన పర్స్ మాత్రం ఎవరో దొంగలించారని అప్పుడు తాను గ్రహించానని రజనీకాంత్ తెలిపారు.ఈ విధంగా తన పర్స్ పోయిందని టికెట్ కలెక్టర్ కి చెప్పిన ఆయన వినలేదు.
అక్కడే ఉన్నటువంటి కూలీలందరూ తన నిజాయితీని నమ్మారని టికెట్ కలెక్టర్ మాత్రం తనని నమ్మక పోలీస్ కంప్లైంట్ ఇస్తానని చెప్పారు.అయితే అక్కడ ఉన్నటువంటి కూలీలు ఎంత బ్రతిమాలిన టికెట్ కలెక్టర్ వినలేదని చివరికి ఫైన్ ఎంతో చెప్పండి మేమే కడతామనీ చెప్పారు.ఇక కూలీలు అలా చెప్పడంతో టికెట్ కలెక్టర్ కూడా తనని ఫైన్ లేకుండా పంపించారని అలా ఆ రోజే తమిళ ప్రజలు తనని నమ్మారని రజినీకాంత్ సందర్భంగా తనకు జరిగిన సంఘటన గురించి తెలియజేశారు.