ఇండస్ట్రీకి చెందిన నటినటులు చూడటానికి మంచి లైఫ్ అనుభవిస్తున్నారని అనుకుంటాం.కానీ అక్కడికి వెళ్లి చూస్తేనే వాళ్ల లైఫ్ ఏంటో అర్ధమవుతుంది.
పైగా వాళ్లు ఇండస్ట్రీలో కొనసాగడానికి ఎంత తాపత్రయపడతారో వాళ్లకే తెలుసు.ఇండస్ట్రీలో కొనసాగడానికి అందం విషయంలో, శరీరాకృతి విషయంలో బాగా కష్టపడుతూ ఉంటారు.
ఇప్పటికి చాలా మంది నటీనటులు మీడియా ముందుకు వచ్చి సినిమా ఇండస్ట్రీ గురించి అందులో పడే కష్టాలు గురించి చాలాసార్లు తెలిపారు.అయితే తాజాగా కమెడియన్ పృథ్వీరాజ్ కూడా ఆర్టిస్టు బ్రతుకు గురించి షాకింగ్ కామెంట్ చేశాడు.
ఇంతకు అసలు విషయం ఏంటంటే.
తెలుగు సినీ ఆర్టిస్ట్ పృథ్వీరాజ్ గురించి తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయమే.
ఎందుకంటే ’30 ఇయర్స్ ఇండస్ట్రీ’ అనే డైలాగుతో బాగా పాపులర్ అయ్యాడు పృథ్వీ రాజ్.ఎన్నో సినిమాలలో సహాయ పాత్రల్లో నటించి తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.1993లో రాజేంద్ర ప్రసాద్ నటించిన ఆ ఒక్కటి అడక్కు సినిమాతో తొలిసారిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యాడు.ఇదిలా ఉంటే తాజాగా తనపై వచ్చిన ట్రోల్స్ కు ఘాటుగా స్పందించాడు.
ఇక ఖడ్గం సినిమాలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగుతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు.ఇక ఒక నటుడిగానే కాకుండా రాజకీయాలలో కూడా బాగా ముందుంటాడు.
గతంలో ఈయన పవన్ గురించి ఎన్నో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.ఆ తర్వాత పవన్ గురించి పొగడడం మొదలుపెట్టాడు.
ఈయన తన రాజకీయాల కారణంగా సినిమా అవకాశాలు కూడా కోల్పోయాడు.
అంతేకాకుండా svbc భక్తి ఛానల్ లో చైర్మన్ గా బాధ్యతలు తీసుకోగా కొన్ని వివాదాలు చేయటంతో ఇందులో నుంచి కూడా తొలగించారు.ఇలా ఎన్నో వివాదాలలో ఇరుక్కోవడమే కాకుండా తెగ ట్రోలింగ్స్ కూడా బాగా ఎదుర్కొంటాడు.ఇక ఎప్పుడు ఈయన తనపై వచ్చే ట్రోలింగ్స్ లను అసలు పట్టించుకోడు.
పని పాట లేని వాళ్ళు అంతా తనపై నోరు పారేసుకుంటారని అంటుంటాడు.
ఇక రాజకీయాల్లో కూడా బాగా యాక్టివ్ గా కనిపిస్తాడు.
కొన్ని కారణాలవల్ల సినిమాలలో అవకాశాలు కూడా కోల్పోయాడు.ఇక గతంలో పవన్ కళ్యాణ్ గురించి వ్యతిరేకంగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత కొంతకాలానికి పవన్ కళ్యాణ్ విషయంలో తన దూకుడును తగ్గించాడు.అంతేకాకుండా ఆయనను ఉద్దేశించి పాజిటివ్ గా మాట్లాడటం ప్రారంభించాడు.
ఇక ఇదంతా పక్కన పెడితే సినీ ఇండస్ట్రీలో ఆర్టిస్టుల పరిస్థితుల గురించి కొన్ని షాకింగ్ విషయాలు బయట పెట్టాడు.గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా.ఇండస్ట్రీలో ఆర్టిస్టుల బాధ ఏంటో ఎవరికి తెలియదు అని.అందంగా ఉంటేనే బుక్ చేస్తారని.ఆర్టిస్ట్ బ్రతుకు ప్రాస్టిట్యూట్ లాంటిదని కొన్ని షాకింగ్ విషయాలు బయట పెట్టాడు.ఇక ఆయన చేసిన కామెంట్లు ప్రస్తుతం బాగా వైరల్ అవుతున్నాయి.