తెలుగు సినిమా ఇండస్ట్రీలో యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో యాంకర్ సుమ కనకాల (Suma Kanakala) ఒకరు.ఈమె పుట్టి పెరిగింది కేరళలో అయినప్పటికీ తన తల్లి ఉద్యోగరీత్యా హైదరాబాద్ రావడంతో ఇక్కడే స్థిరపడ్డారు.
ఇలా హైదరాబాదులో స్థిరపడినటువంటి సుమ ఎంతో స్పష్టంగా తెలుగు నేర్చుకున్నారు.ఇలా కెరియర్ మొదట్లో సుమ పలు సీరియల్స్ లో నటించి మెప్పించారు.
అదేవిధంగా పలు సినిమాలలో కూడా ఈమె నటించి సందడి చేశారు.
ఇలా ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి సుమ నటిగా కంటే యాంకర్ గా బాగా సక్సెస్ అందుకున్నారని చెప్పాలి.
తెలుగు బుల్లితెరపై యాంకర్ గా ఎన్నో కార్యక్రమాలకు యాంకరింగ్ చేస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేయడమే కాకుండా ఒక సినిమా వేడుకలకు కూడా యాంకరింగ్ చేస్తూ బిజీగా ఉన్నారు.ఇలా సినిమా ట్రైలర్ టీజర్ లాంచ్ కార్యక్రమాల నుంచి మొదలుకొని సినిమా సక్సెస్ ఈవెంట్ వరకు సుమ యాంకరింగ్ చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.
కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి సుమ నటుడు రాజీవ్ కనకాల(Rajeev Kanakala) ను వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.ప్రేమ వివాహం. వీరి ప్రేమ పెళ్లి గురించి సుమా పలు సందర్భాలలో చెప్పుకొచ్చారు తమ పెళ్ళికి పెద్దవాళ్లు అడ్డుకున్నారని వారం రోజులపాటు తనని గదిలో పెట్టి బంధించారు అంటూ తెలియజేశారు.అయినప్పటికీ తన పంతం వదలక పోవడంతో పెళ్లి చేశారని సుమ ఇంటర్వ్యూలలో తెలియజేశారు.
ఇక సుమ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటున్న సంగతి మనకు తెలిసినదే.యూట్యూబ్ ఛానల్ మాత్రమే కాకుండా ఇంస్టాగ్రామ్ వేదికగా కూడా ఈమె రీల్స్ చేస్తూ పెద్ద ఎత్తున అభిమానులను సొంతం చేసుకున్నారు.తాజాగా సుమ సోషల్ మీడియా వేదికగా తన వెడ్డింగ్ కార్డ్ షేర్ చేశారుఇక వీరి వివాహం 1994వ సంవత్సరంలో కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో ఘనంగా జరిగింది.
అయితే తాజాగా సుమా సోషల్ మీడియా వేదికగా వీరి పెళ్లి పత్రికను షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.ఇలా సుమ సోషల్ మీడియా వేదికగా తన పెళ్లి పత్రికను షేర్ చేయడమే కాకుండా మీరు కార్డు చదివారా? 1999లోనే యునిక్ వేలో వెడ్డింగ్ కార్డ్(Wedding Card) అంటూ క్యాప్షన్ పెట్టారు.ప్రస్తుతం సుమ వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది ఈ ఫోటో పై స్పందిస్తూ పాతికళ్ళ క్రితమే ఈ రేంజ్ లో వెడ్డింగ్ కార్డ్ ప్రింట్ చేయించారా నిజంగా గ్రేట్ సుమక్క అంటూ కామెంట్లు చేస్తున్నారు.