బుల్లితెరపై జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా కొనసాగుతూ తన కామెడీతో ప్రేక్షకులను పెద్ద ఎత్తున మెప్పించినటువంటి వారిలో కమెడియన్ సుడిగాలి సుదీర్ ( Sudheer ) ఒకరు.ఇలా వేణు వండర్స్ టీం లో ఈయన కమెడియన్ గా సందడి చేసేవారు.
తన టాలెంట్ తో అది తక్కువ సమయంలోనే టీం లీడర్ గా మారిపోయారు.ఇలా టీమ్ లీడర్ గా జబర్దస్త్ ( Jabardasth )కార్యక్రమంలో కొనసాగుతూ ఎంతోమంది ప్రేక్షకులను సందడి చేసిన సుధీర్ విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.
ఇలా రోజురోజుకు ఈయనకు ఉన్నటువంటి క్రేజ్ పెరిగిపోవడంతో ఏకంగా ఈయనకు సినిమా అవకాశాలు కూడా వచ్చాయి.
ఒకవైపు జబర్దస్త్ కార్యక్రమంలో చేస్తూనే మరోవైపు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి కూడా ఈయన వ్యాఖ్యాతగా వ్యవహరించేవారు.ఇలా సుధీర్ క్రేజ్ పెరగడమే కాకుండా బుల్లితెర మెగాస్టార్ అనే ఇమేజ్ కూడా సొంతం చేసుకున్నారు.దీంతో ఈయనకు సినిమా అవకాశాలు రావడంతో వెండితెరపై ప్రస్తుతం ఎంతో బిజీగా ఉన్నారు.
వెండితెరపై వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్నటువంటి సుధీర్ ప్రస్తుతం పలు సినిమాలో షూటింగ్ పనులలో బిజీ అయ్యారు.ఇక ఈయన నటించిన కాలింగ్ సహస్ర ( Calling Sahastra ) అనే సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో సుధీర్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సుధీర్ ( Sudheer ) మాట్లాడుతూ వెండితెరపై కూడా ప్రేక్షకులు తనని ఎంతగానో ఆదరిస్తున్నారని తెలియజేశారు.త్వరలోనే తాను కాలింగ్ సహస్ర అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నానని, ఈ సినిమా కూడా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని ఈయన ఆశాభావం వ్యక్తం చేశారు.ఇకపోతే నేడు నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే అందుకు గల కారణం అభిమానులు, ప్రేక్షకులేనని ఈయన తెలియజేశారు.వారు నాపై చూపిస్తున్నటువంటి ప్రేమ నన్ను ఆదరిస్తున్నటువంటి తీరు ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టింది.
నేను బుల్లితెరపై చేసిన వెండితెరపై చేసిన వారి అభిమానం ఏమాత్రం తగ్గలేదని వారు చూపిస్తున్నటువంటి ప్రేమాభిమానాలకు తాను జీవితాంతం రుణపడి ఉంటాను అంటూ సుధీర్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.