దర్శకుడిగా మారిన నెంబర్ వన్ ఫైట్ మాస్టర్.. జనవరిలో సినిమా రిలీజ్

ప్రస్తుతం ఇండియాలోనే నెంబర్ వన్ స్టెంట్ కొరియోగ్రాఫర్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్న వ్యక్తి పీటర్ హెయిన్.సౌత్ సినిమాలతో స్టంట్ మాస్టర్ గా కెరియర్ స్టార్ట్ చేసి అడ్వాన్స్ యాక్షన్ ఎపిసోడ్స్ తో సౌత్ సినిమాలకి కొత్త ఇమేజ్ తీసుకొచ్చిన పీటర్ హెయిన్ తన యాక్షన్ సీక్వెన్స్ తో గూస్ బాంబ్స్ వచ్చేలా చేయించాడు.

 Stunt Choreographer Peter Hein Turns Into Director, Tollywood, Bollywood, Indian-TeluguStop.com

ఈ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించే సమయంలో చాలా సందర్భాలలో ప్రమాదం అంచుల వరకు వెళ్ళాడు.అయినా కొత్తదనం కోసం ఎంత రిస్కీ అయినా చేయడానికి పీటర్ హెయిన్ సిద్ధంగా ఉంటాడు.

సౌత్ లో ఒకప్పుడు స్టార్ హీరో సినిమా అంటే రామ్ లక్ష్మణ్ పేర్లు వినిపించేవి వారిని బీట్ చేసి పీటర్ హెయిన్స్ రేసులోకి దూసుకొచ్చేశాడు.బాహుబలి, రోబో లాంటి పాన్ ఇండియా సినిమాలకి పనిచేసి ఇండియన్ వైడ్ గా తన ఇమేజ్ ని పెంచుకున్నాడు.

అయితే ఈ యాక్షన్ దర్శకుడు పూర్తిస్థాయిలో మెగా ఫోన్ పట్టి దర్శకుడు అవతారం ఎత్తాడు.అయితే అతను దర్శకత్వం వహించి సినిమా తీసింది మూడేళ్ళ క్రితమే.
అయితే ఆ సినిమా ఇండియన్ లాంగ్వేజ్ లో కాకుండా తన మాతృభాష వియత్నామీస్ లో చిత్రం తెరకెక్కించాడు సామ్ హోయి పేరుతో రూపొందుతోంది.ఈ కథ బాక్సింగ్ చుట్టూ తిరుగుతుంది.

ఇండియా-వియత్నాం ఉమ్మడి నిర్మాణంగా ప్రకటించిన ఈ చిత్రం కొన్నేళ్ల క్రితం సెట్స్ పైకి వెళ్లింది.వాస్తవానికి 2017 లోనే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది.

అనివార్య కారణాల వల్ల వాయిదా పడి అన్ని అడ్డంకులూ అధిగమించి 2021 జనవరి 15 న విడుదల కాబోతోంది.వియత్నాంతో పాటు ఇండియా, చైనాలోనూ ఈ చిత్రం రిలీజ్ కానుంది.

ఈ మూవీలో వియత్నాం నటులు బిన్ మిన్ అన్ థూ ప్రధాన పాత్ర పోషించారు.మరి స్టంట్ మాస్టర్ తెరకెక్కించిన ఈ సినిమా ఎంత వరకు హిట్ అవుతుంది అనేది వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube