విక్రమ్, సదా హీరో హీరోయిన్స్ గా శంకర్ దర్శకత్వంలో వచ్చిన అపరిచితుడు సినిమా( Aparichitudu ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.2005లో మొదటి తమిళ్లో అన్నియన్ పేరుతో విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని బద్దలు కొట్టింది.అప్పట్లో ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా కాదు.అయితే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ కావడం వెనక ఎన్నో స్ట్రగుల్స్ చూడాల్సి వచ్చింది శంకర్.
అపరిచితుడు సబ్జెక్టు ప్రిపేర్ చేసుకొని మొదట రజనీకాంత్( Rajinikanth ) కోసం కథ చెప్పగా మూడు రకాల పాత్రలు అనేసరికి రజనీకాంత్ కు ఎందుకు నచ్చలేదట.దాంతో ఈ సినిమా హీరో విక్రమ్( Hero Vikram ) దగ్గరికి వెళ్ళింది.
శంకర్ ఈ మూడు పాత్రలపై ఎంత హోమ్ వర్క్ చేశాడో అర్థం చేసుకొని అంతకన్నా మించి విక్రమ్ ఈ కథపై నమ్మకంతో చాలా హోమ్ వర్క్ చేశాడు.
మూడు పాత్రలను ఎంతో విభిన్నంగా చూపించడం పై బాగాశ్రద్ధ వహించాడు.మూడు భిన్నమైన పాత్రలుగా ఈ సినిమా చాలా అద్భుతంగా కనెక్ట్ అయింది.అయితే ఈ సినిమాలో హీరో రజనీకాంత్ కాకుండా విక్రమ్ ఎలా ముందుకు వచ్చాడో అలాగే సదా కన్నా ముందు మరో ఇద్దరు స్టార్ హీరోయిన్స్ ఈ కథను రిజెక్ట్ చేశారట.
మొదట ఈ కథను అప్పటికే జీన్స్ సినిమాతో తన సినిమాలో హీరోయిన్ గా నటించిన ఐశ్వర్య రాయ్( Aishwarya Rai ) తో చేయించాలి అనుకున్నాడు.కానీ అప్పటికే ఆమె చాలా బిజీగా ఎన్నో సినిమాలను ఒప్పుకొని ఉంది.
కథ బాగా నచ్చినప్పటికీ డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయింది ఐశ్వర్య.
అలా ఐశ్వర్య చేతి నుంచి ఈ చిత్రం వెళ్ళిపోయింది.ఆ తర్వాత సిమ్రాన్( Simran ) కూడా ఈ కథ కోసం అనుకున్నారు కానీ అది కూడా కొన్ని కారణాల వల్ల సెట్ కాకపోవడంతో సదా ఫైనల్ గా సెలెక్ట్ అయింది.ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిన సదా( Sadha ) కి మాత్రం పెద్దగా ఈ సినిమా తర్వాత ఆశించిన స్థాయిలో ఆఫర్స్ రాలేదు.
ఒకవేళ ఈ సినిమాలో సదా కాకుండా మరొకరు ఎవరైనా నటించి ఉంటే అపరిచితుడు చిత్రం రేంజ్ కూడా మరింత పెరిగేదేమో.ఏది ఏమైనా ఒక హిట్ సినిమా మాత్రం ఆమె ఖాతాలో పడింది.
అలా ఐశ్వర్య రాయ్, సిమ్రాన్ లాంటి స్టార్ హీరోయిన్స్ ని కాదనుకొని డైరెక్టర్ శంకర్ సదాని సెలెక్ట్ చేసుకోవడం వెనుక కారణాలు ఏంటో తెలియదు కానీ నిజంగా ఒక మంచి చిత్రంలో మాత్రం ఆమె నటించింది.