తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు ప్రభాస్(Prabhas) ఒకరు.కృష్ణంరాజు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి ఈయన ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
ఇక రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి (Bahubali) సినిమా ద్వారా ఏకంగా పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి ప్రభాస్ ఈ సినిమా తర్వాత తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే నటిస్తున్నారు.ఇలా పాన్ ఇండియా స్టార్ గా వరుస సినిమాలలో నటిస్తున్నటువంటి ప్రభాస్ సరసన సినిమాలలో నటించడం కోసం ఎంతోమంది హీరోయిన్స్ ఎదురుచూస్తున్నారు.
ఇలా ప్రభాస్ సినిమాల్లో అవకాశం వస్తే చాలు అని ఎదురు చూస్తూ ఉండగా ఒక హీరోయిన్ మాత్రం అసలు ప్రభాస్ సినిమాలో తాను ఎందుకు నటించాను అని ఇప్పటికీ బాధపడుతూ ఉంటారట.ప్రభాస్ లాంటి స్టార్ హీరో సినిమాలో నటించి బాధపడుతున్నటువంటి ఆ హీరోయిన్ ఎవరు అసలు ఎందుకు ఈమె బాధపడుతుంది అనే విషయానికి వస్తే… ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత సుజిత్ దర్శకత్వంలో నటించిన చిత్రం సాహో(Sahoo).
ఈ సినిమాలో బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్(Shradha kapoor) నటించారు.ఆషికీ 2 సినిమాతో బాలీవుడ్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న శ్రద్ధ అనూహ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది.
ప్రభాస్ నటించిన ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది అయితే సౌత్ ఇండస్ట్రీలో మాత్రం ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఏకంగా 150 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి మంచి సక్సెస్ అందుకుంది.ఇక ఈ సినిమాలో భారీ యాక్షన్స్ సన్ని వేషాలు ఉండడంతో సౌత్ ప్రేక్షకులకు ఇది పెద్దగా ఎక్కలేదు.దీంతో ఈ సినిమాకు ఏమాత్రం ఆదరణ రాలేదని చెప్పాలి.ఇలా సౌత్ లో సక్సెస్ కానటువంటి సాహో సినిమాకు బాలీవుడ్ ఇండస్ట్రీలో( Bollywood ) మాత్రం భారీ క్రేజ్ ఏర్పడింది.
ప్రభాస్ అంటే స్టార్ హీరో సరసన నటించే టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకోవాలని ప్రయత్నాలు చేసినటువంటి శ్రద్ధ కపూర్ ఆశలు ఏ మాత్రం ఫలించలేదు.అయితే అప్పటికే ఈ సినిమాలో నటించవద్దని తన స్నేహితుడు తనకు ఎంత చెప్పినప్పటికీ ఈమె మాత్రం ఈ సినిమాపై నమ్మకంతో ప్రభాస్ సినిమాకు కమిట్ అయ్యారట అయితే ఈ సినిమా భారీగా డిజాస్టర్ కావడంతో ఈ సినిమా విషయంలో శ్రద్ధా కపూర్ ఇప్పటికి బాధపడుతూ ఉంటారట.
తన స్నేహితుడు చెప్పిన విధంగా ఈ సినిమాలో తాను నటించకుండా వేరే హీరో ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లి ఉండింటే తన కెరియర్ పూర్తిగా మారిపోయేదని ఈమె బాధపడుతుందని బాలీవుడ్ సమాచారం.ఇక ఈ సినిమా తర్వాత సుజిత్ దర్శకత్వంలో(Sujeeth) సినిమా చేయాలని పలువురు హీరోలు కూడా భావించారు అయితే ఈ సినిమా డిజాస్టర్ కావడంతో ఈయనకు అవకాశాలు కూడా కరువయ్యాయి.చాలా సంవత్సరాలు తర్వాత సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) హీరోగా నటిస్తున్నటువంటి ఓ జి సినిమా( OG Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.మరి ఈ సినిమా ద్వారా అయినా సుజిత్ సక్సెస్ అందుకుంటారా పవన్ కళ్యాణ్ కు హిట్ అందిస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది.