సినిమాలను పోలిన సినిమాలు చాలానే ఉంటాయి.దమ్ముని కాస్తా మార్చితే మిర్చి అయినట్టు … బావగారు బాగున్నారు ఇంకో రకంగా తీస్తే బృందావనం అయినట్టు.
ఇలా చెప్పుకుంటేపొతే చాలా పెద్ద లిస్టు బయటకి వస్తుంది.కాని సినిమాల మధ్య గ్యాప్ ఉండటం వల్ల పోల్చుకోవడంలో ఆలస్యం జరగడం లేదా సరిపెట్టుకోవడం జరిగింది.
ఇప్పుడు కిక్-2 కి పెద్ద సమస్య వచ్చి పడింది.ఒక ఊరికి అన్ని రకాల వసతులు కల్పించి గ్రామాన్ని దోచుకుంటున్న దుర్మార్గుల్ని బుద్ధి చెప్పడం శ్రీమంతుడులో చూసాం.
చూడటంతో సరిపెట్టకుండా బాక్సాఫీస్ దగ్గర మహేష్ బాబు తాండవం చెస్తూ ఉంటే మురిసిపోతున్నాం.
కిక్-2 కథ కుడా ఇంచు మించు శ్రీమంతుడులానే ఉందంట.
ఇందులో రవితేజ కుడా ఒక ఊరినీ పట్టి పీడిస్తున్న విలన్స్ ని ఆటాడుకొని ఆ ఊరి బాగోగులు చూసుకుంటాడంట.అయితే ఈసారి రెండు సినిమాల మధ్య గ్యాప్ లేదు.
శ్రీమంతుడు ప్రభావం కిక్-2 మీద పడొచ్చని సినీ విశ్లేలకుల అభిప్రాయం .ఈ నెల 21న విడుదల కానున్న కిక్-2 ని ఏ మేరకు ప్రజలు ఆదరిస్తారో చూడాలి.