సంచలన తార శ్రీరెడ్డి( Sree Reddy )తరచూ ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరోలపై ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు.అయితే ముఖ్యంగా ఈమె మెగా ఫ్యామిలీ( Mega Family ) ని టార్గెట్ చేస్తూ ఉంటారనే సంగతి మనకు తెలిసిందే.
మెగా ఫ్యామిలీలో చిరంజీవి నుంచి మొదలుకొని పవన్ కళ్యాణ్ నాగబాబును కూడా ఈమె తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఉంటారు.ఇకపోతే తాజాగా శ్రీరెడ్డి సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు రాజకీయాలలో కూడా ఎంతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే.ఇలా సినిమా షూటింగులతో పాటు ఈయన వారాహి యాత్ర( Varahi Yatra ) లో పాల్గొంటూ అధికార ప్రభుత్వం వైఎస్ఆర్సిపి పై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరుగుతున్నారు.ఈ క్రమంలోనే శ్రీ రెడ్డి పవన్ కళ్యాణ్ రాజకీయాల గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.పవన్ కళ్యాణ్ ఇటు సినిమాలను అటు రాజకీయాలను రెండింటిని బ్యాలెన్స్ చేయడంలో చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.
ఆయన వారాహి యాత్రలో పాల్గొంటే తనకోసం ఇంతమంది వచ్చారని అభిమానులను చూసి ఆనందపడాలో లేకపోతే వీళ్లంతా రేపు నాకు ఓట్లు వేయరని బాధపడాలో పవన్ కళ్యాణ్ కు అర్థం కావడం లేదు పాపం అంటూ కామెంట్ చేశారు.ఇలా పవన్ కళ్యాణ్ కు వచ్చినటువంటి కష్టం ఏ పగ వాడికి కూడా రాకూడదు అంటూ ఈమె తెలియజేశారు.ఇలా పవన్ కళ్యాణ్ గురించి శ్రీ రెడ్డి చేసినటువంటి ఈ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ శ్రీరెడ్డి పట్ల విమర్శలు కురిపిస్తున్నారు.
అయితే ఈమె రాజకీయాల గురించి ఎప్పుడు మాట్లాడిన వైఎస్ఆర్సిపి పార్టీకి మద్దతు తెలుపుతూ మాట్లాడుతూ ఉంటారని సంగతి మనకు తెలిసిందే.