కొనాల్సింది కొనకుండా ఏకంగా షాపునే కొనుగోలు చేసిన యువతి?

నేటి మనిషి పట్టణీకరణకు( Urbanization ) అలవాటు పడిపోతున్నాడు.అడవులను కూడా నరికేసి కాంక్రీట్ జంగిల్ ని ఏర్పాటు చేస్తున్నాడు.

 Woman Visits Ikea Hyderabad To Buy One Lamp Walks Out With Bill As Tall As Her D-TeluguStop.com

పల్లెలు, పట్టణాలు అని తేడాలేకుండా ప్రతిచోటా మాల్స్ కల్చర్ వచ్చేసింది.నిత్యావసరల వస్తువులు కొనుగోలు చేయడానికి ఒకప్పుడు కిరాణ కొట్టుకు వెళ్లేవారు.

కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.కిరణాకు బదులు షాపింగ్ మాల్ కు( Shopping Mall ) వెళ్లి అవసరమైన వస్తువులు తెచ్చుకుంటున్న పరిస్థితి.

మాల్స్ అనేది ఓ పెద్ద బిజినెస్ స్ట్రాటజీ.అక్కడికి ఓ చిన్న సంచితో వెళ్ళినవారు తిరిగి వచ్చేటప్పుడు ఓ పెద్ద సంచిని కొనుక్కొని మరీ దానిని లాక్కొని వస్తూ వుంటారు.

Telugu Buy Lamp, Furniture, Ikea, Ikea Hyderabad, Ikea Mall, Sameera Khan, Tall,

అక్కడికి వెళ్లాక సహజంగానే మనిషి సైకాలజీ మారుతుంది.దీంతో అవసరం వున్నవి, లేనివి కూడా కొనుగోలు చేసి అవసరానికి మించి ఖర్చు చేస్తూ వుంటారు.తాజాగా ఇలాంటి ఓ అనుభవాన్ని ఓ యువతి సోషల్ మీడియా( Social Media ) వేదికగా షేర్ చేసింది.తాను దీపం కొనడానికి వెళ్లి, తనకంటే పొడవైన బిల్లు వచ్చేలా షాపింగ్ చేయాల్సి వచ్చిందని వెల్లడించింది.

దాంతో ఈ ఫొటో ఇప్పుడు వైరల్ గా మారింది.వివరాల్లోకి వెళితే… సమీరా ఖాన్( Sameera Khan ) అనే ఓ అమ్మాయి IKEA షాపింగ్ మాల్ లో నిల్చొని తనకంటే పొడవైన బిల్లుతో ఫోజులిచ్చింది.

ఈ సందర్భంగా ఆమె తన ట్విట్టర్ ఖాతాలో ‘ఈ బిల్లు నాకంటే పొడవుగా వచ్చింది’ అని చమత్కారంగా కామెంట్ చేసింది.

Telugu Buy Lamp, Furniture, Ikea, Ikea Hyderabad, Ikea Mall, Sameera Khan, Tall,

సమీరాఖాన్ ఓ దీపం కొనడానికి IKEA కు వెళ్లి దీపం కొనడం మాని అక్కడ ఫర్నీచర్( Furniture ) కొనుగోలు చేశారట.వ్యక్తులు ఎవరైనా షాపింగ్ మాల్ లోకి వెళ్ళేటప్పుడు చిన్న వస్తువు కొనుగోలు చేయాలని అనుకుంటారు.కానీ అందులోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత వారి మన మనసులు మారిపోతాయి.

ఇక్కడ ఆకర్షించే వస్తువులు చూడగానే టెంప్ట్ అవుతారు.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమీరాఖాన్ ఫోస్టు పై చాలా మంది రియాక్ట్ అయ్యారు.

ఓ నెటిజన్ స్పందిస్తూ ‘ద్వేషించేవారు ద్వేషిస్తారు.కానీ మీరు అనిపించింది మీరు చేసారు’ అని మద్దతు పలికాడు.

మరో వ్యక్తి ‘మనం కోరుకున్న వస్తువులను వదిలేసి ఇతర వస్తువులను కొనుగోలు చేస్తాం.ఇది సర్వ సాధారణమే’ అంటూ కామెంట్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube