Divya Bharti: దివ్యభారతి చనిపోయి ఇంతమంది హీరోయిన్లకు లైఫ్ ఇచ్చిందా..?

నటి దివ్యభారతి ( Divya Bharti ) అతి చిన్న ఏజ్ లోనే ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది.అంతేకాదు అప్పట్లో ఇండియాలోనే హైయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.

 Heroines Got Chance After Divya Bharti Death-TeluguStop.com

అలాంటి ఈ ముద్దుగుమ్మ కేవలం 19 ఏళ్ల వయసులోనే మరణించడం చాలా బాధాకరం.

Telugu Bobbili Raja, Bobbiliraja, Dharmakshetram, Divya Bharti, Divyabharti, Kar

ఇక ఈమె మరణ వార్తను విన్న ఆమె అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు.అంతేకాదు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు.అయితే ఆమె మరణానికి( Divya Bharti Death Mystery ) సరైన కారణం ఇప్పటికీ కూడా తెలియదు.

దివ్యభారతి మరణం ఇప్పటికీ మిస్టరీనే.చాలామంది ఆ మిస్టరీని ఛేదించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అది మాత్రం అంతు చిక్కడం లేదు.
ఇక ఆమె మద్యం మత్తులో తన ఇంటి బాల్కనీ నుండి కింద పడిపోయి చనిపోయింది అని అప్పట్లో వార్తలు వినిపించాయి.అయితే ఈ ఇండస్ట్రీకి వచ్చిన చిన్న ఏజ్ లోనే సౌత్ నార్త్ ప్రేక్షకులను ఆకట్టుకొని తన అందచందాలతో స్టార్ హీరోయిన్ గా మారింది.

వెంకటేష్హీ రోగా వచ్చిన బొబ్బిలి రాజా సినిమా( Bobbili Raja )తో తెలుగు సినీ రంగ ప్రవేశం చేసింది.ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో అసెంబ్లీ రౌడీ, రౌడీ అల్లుడు,ధర్మక్షేత్రం వంటి సినిమాల్లో నటించింది.

Telugu Bobbili Raja, Bobbiliraja, Dharmakshetram, Divya Bharti, Divyabharti, Kar

ఇవే కాకుండా హిందీలో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది.అయితే అలాంటి ఈ హీరోయిన్ తను చనిపోతూ కూడా చాలామంది హీరోయిన్లకు లైఫ్ ఇచ్చిందట.ఇక అసలు విషయంలోకి వెళ్తే.అప్పట్లో ఈ హీరోయిన్ క్రేజ్ ఎక్కువగా ఉండడంతో చాలామంది దర్శక నిర్మాతలు దివ్యభారతి ( Divya Bharti ) కే ఎక్కువగా అవకాశాలు ఇచ్చేవారట.

దాంతో అప్పుడు ఇండస్ట్రీలో ఉన్న మిగతా హీరోయిన్లకు అవకాశాలు ఉండకపోయేవట.కానీ దివ్యభారతి మరణానికి ముందు ఆమె దాదాపు 14 సినిమాలకు ఒప్పుకుందట.
ఇక ఈమె చనిపోవడంతో ఆ 14 సినిమాల్లో హీరోయిన్ గా వేరే హీరోయిన్ లను తీసుకున్నారు.అలా శ్రీదేవి, రవీనా టాండన్,టబూ, కరిష్మా కపూర్, కాజోల్( Kajol ),పూజ భట్,జుహీ చావ్లా, మమతా కులకర్ణి వంటి హీరోయిన్లు ఆమె ఒప్పుకున్నా సినిమాల్లో నటించి హిట్ అందుకొని స్టార్ హీరోయిన్ గా మారారు.

అలా దివ్యభారతి చనిపోయినా కూడా చాలామంది హీరోయిన్లకు లైఫ్ ఇచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube