Punjabi language : పంజాబీని కాపాడుకునేందుకు స్పెషల్ యాప్... ఎన్ఆర్ఐ పిల్లలకు మేలు..!!

భాష మానవజాతి మనుగడకు ఆధారం.ఒక వ్యక్తి తనలోని భావాలను ఇతరులకు తెలియజేయడానికి భాష అత్యవసరం.మానవజాతి పరిణామ క్రమంలోనే భాష పుట్టింది.దీని ద్వారా ఎంతో అభివృద్ధి జరిగింది.ఎన్నో నాగరికతల గురించి భవిష్యత్ తరాలు తెలుసుకోవడానికి భాష ఉపయోగపడింది.కాలక్రమంలో ఎన్నో భాషలు అంతరించిపోగా, ఇంకొన్ని ఆ ప్రమాదంలో వున్నాయి.

 Sri Ganganagar District Administration Launches Drive To Promote Punjabi Languag-TeluguStop.com

భారతదేశం విషయానికే వస్తే.వందలాది భాషల వారసత్వ స్వరూపం మనదేశం.

అయితే పాశ్చాత్య పోకడల కారణంగా రానురాను భాషా, సంస్కృతులు కనుమరుగవుతున్నాయి.భాషను బట్టి ఆయా జాతుల, తెగల సంస్కృతి వికసిస్తుంది.

అందువల్లే ఒక భాష అంతరించే దశలో వుందంటే ఆ భాషను మాట్లాడే జనాభా సైతం తగ్గిపోతుందని భావించాల్సి వుంటుంది.మనదేశంలోని కొన్ని రాష్ట్రాల ప్రజలు తమ మాతృభాషను కాపాడుకునేందుకు అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్ధపడతారు.

ఇకపోతే.పంజాబీలు కూడా తమ భాషను కాపాడుకునేందుకు చర్యలు చేపట్టారు.

పంజాబ్‌కు సరిహద్దుల్లోని రాజస్థాన్‌ పట్టణమైన శ్రీగంగానగర్‌లోని పంజాబీ మాట్లాడే కుటుంబాల కోసం ఒక యాప్‌ను రూపొందించారు. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ సహకారంతో జిల్లా ఇన్ఫర్మేటిక్స్ అధికారి అభివృద్ధి చేసిన లెర్న్ పంజాబీ యాప్ ద్వారా పంజాబీని సులభంగా నేర్చుకోవచ్చని జిల్లా కలెక్టర్ సౌరభ్ స్వామి తెలిపారు.

ఇంగ్లీష్, హిందీ, గుజరాతీ, ఉర్దూ ద్వారా ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయిలోని పంజాబీ భాషను నేర్చుకోవచ్చు.కెనడా, యూకే, యూఎస్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల్లో స్థిరపడిన ప్రవాసీ పంజాబీలకు ఈ యాప్ ద్వారా ప్రయోజనం చేకూరుతుంది.

Telugu Australia, Canada, Delhi, Haryana, Zealand, Promotepunjabi, Rajasthan, Ra

రాజస్ధాన్ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డ్, మహారాజా గంగా సింగ్ యూనివర్సిటీలు.విద్యార్ధులు పంజాబీని మూడవ భాషగా , ఐచ్ఛిక సబ్జెక్ట్‌గా నేర్చుకునేందుకు అనుమతి ఇచ్చినట్లు కలెక్టర్ వెల్లడించారు.పంజాబ్‌లో పంజాబీ ప్రథమ భాషగా.ఢిల్లీ, హర్యానా, జమ్మూకాశ్మీర్‌లలో ద్వితీయ భాషగానూ గుర్తింపు పొందింది.పంజాబీ మాట్లాడే ప్రజలు ప్రపంచవ్యాప్తంగా 133 దేశాల్లో స్థిరపడ్డారు.అందువల్ల ఈ భాషను ప్రోత్సహించాల్సిన అవసరం వుందని కలెక్టర్ పేర్కొన్నారు.

భారతీయ భాషలు, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించడమే తమ లక్ష్యమని సౌరభ్ స్వామి పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube