శ్రీజ కళ్యాణ్ దేవ్ విడాకులు తీసుకోబోతున్నారని గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.ఇటు శ్రీజ అటు కళ్యాణ్ దేవ్ ఈ వార్తల గురించి స్పందించకపోవడంతో చాలామంది ఈ వార్తలు నిజం కావచ్చని భావించారు.
తాజాగా శ్రీజ ఇన్స్టాగ్రామ్ లో భర్తను అన్ ఫాలో చేశారు.శ్రీజ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల త్వరలో శ్రీజ కళ్యాణ్ దేవ్ విడిపోవడం ఖాయమేనని కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఇదే సమయంలో కళ్యాణ్ దేవ్ మాత్రం శ్రీజను ఫాలో అవుతుండటం గమనార్హం.కొన్నిరోజుల క్రితం ఇన్ స్టాగ్రామ్ లో పేరును మార్చుకున్న శ్రీజ తాజాగా అభిమానులకు షాకిచ్చేలా తీసుకున్న నిర్ణయం గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఐదేళ్ల క్రితం శ్రీజ కళ్యాణ్ దేవ్ వివాహం జరగగా ఈ జంటకు ఒక పాప ఉన్నారు.అటు శ్రీజ కానీ ఇటు కళ్యాణ్ దేవ్ కానీ విడిపోతున్నామని అధికారికంగా చెప్పలేదు.
అయితే ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఉన్నాయని శ్రీజ, కళ్యాణ్ దేవ్ చెప్పకనే చెబుతున్నారు.
ఇప్పటికే పలువురు సెలబ్రిటీ జోడీలు విడిపోయిన నేపథ్యంలో శ్రీజ కళ్యాణ్ దేవ్ కూడా విడిపోతే ఆ వార్త అభిమానులకు పెద్ద షాక్ అనే చెప్పాలి.మరోవైపు కళ్యాణ్ దేవ్ హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నా సినిమా రంగం అతనికి కలిసిరాలేదనే చెప్పాలి.సంక్రాంతికి కళ్యాణ్ దేవ్ హీరోగా నటించి విడుదలైన సూపర్ మచ్చి ఫ్లాపైంది.
హీరో కళ్యాణ్ దేవ్ కూడా సినిమాకు ప్రమోషన్లు నిర్వహించకపోవడంతో మెగా ఫ్యాన్స్ కూడా ఈ సినిమాను పట్టించుకోలేదు.కళ్యాణ్ దేవ్ తర్వాత సినిమాతో అయినా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంటారో లేదో చూడాల్సి ఉంది.కిన్నెరసాని పేరుతో కళ్యాణ్ దేవ్ హీరోగా ఒక సినిమా తెరకెక్కుతుండగా త్వరలో ఈ సినిమా రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది.