Tollywood Directors: ఈ ఏడాదిలో తొలి సినిమాతోనే హిట్ అందుకున్న టాలీవుడ్ డైరెక్టర్లు వీళ్లే?

ఇక మరికొద్ది రోజులలో ఈ సంవత్సరం ముగిసిపోతుంది.దీంతో ఈ ఏడాది అద్భుతమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నాయి.

 South Indian Debutant Directors And Their Must Watch Movies 2023 Shouryuv Srika-TeluguStop.com

అయితే చాలా మంది కొత్త డైరెక్టర్లు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.ఇలా ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి వీళ్ళు మొదటి సినిమాతోనే ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.మరి ఈ ఏడాది డైరెక్టర్లుగా ఇండస్ట్రీకి పరిచయమై మొదటి సినిమాతోనే హిట్ అందుకున్నటువంటి డైరెక్టర్లు ఎవరు వారు తీసిన సినిమాలు ఏవి అనే విషయానికి వస్తే…

Telugu Dasara, Shouryuv, Srikanth Odela, Nani, Nanna, Indian Debutant-Movie

ఈ ఏడాది నాచురల్ స్టార్ నాని( Nani ) ఏకంగా రెండు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ సినిమాలను అందుకున్నారు.ఇక ఈ రెండు సినిమాల ద్వారా కూడా ఈయన ఇద్దరు కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు.ఈ ఇద్దరు డైరెక్టర్లు నానితో సినిమాలు చేసే బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని అందుకున్నారని చెప్పాలి.మరి ఆ ఇద్దరు డైరెక్టర్లు ఎవరు అంటే.

శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) అలాగే శౌర్యువ్(Shouryuv).

Telugu Dasara, Shouryuv, Srikanth Odela, Nani, Nanna, Indian Debutant-Movie

శ్రీకాంత్ ఒదెలా:

ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ దగ్గర శిష్యుడిగా పని చేసినటువంటి శ్రీకాంత్ అనంతరం నాని హీరోగా తెరకెక్కినటువంటి దసరా (Dasara) సినిమాకు దర్శకుడిగా పనిచేశారు.ఇలా ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమైనటువంటి శ్రీకాంత్ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నార.ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడం విశేషం.

సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో తెరకేక్కిన ఈ సినిమాలో నానితో కీర్తి సురేష్ కలిసి నటించారు.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకుంది.

ఇక ఈ సినిమా ద్వారా దర్శకుడు మొదటి సక్సెస్ అందుకున్నారు అయితే తదుపరి సినిమాను మాత్రం ఇప్పటివరకు ప్రకటించలేదు.

Telugu Dasara, Shouryuv, Srikanth Odela, Nani, Nanna, Indian Debutant-Movie

శౌర్యువ్:

నాని తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి చిత్రం హాయ్ నాన్న(Hi Nanna).ఈ సినిమా కూడా ప్రేక్షకులను పెద్ద ఎత్తున థియేటర్లలో సందడి చేస్తోంది.డిసెంబర్ 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ఇప్పటివరకు 50 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిందని తెలుస్తుంది.

ఇక ఈ సినిమాకు శౌర్యువ్ అనే కొత్త దర్శకుడు పని చేశారు.ఇక ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి శౌర్యువ్ మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకుంటున్నారు.

మరి ఇలా మొదటి సినిమాల ద్వారానే మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఇద్దరి హీరోలని నాని పరిచయం చేయడం విశేషం.మరి వీరి తదుపరి సినిమాలను ఏ హీరోతో చేస్తారు అనే విషయాలు తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube