Tollywood Directors: ఈ ఏడాదిలో తొలి సినిమాతోనే హిట్ అందుకున్న టాలీవుడ్ డైరెక్టర్లు వీళ్లే?
TeluguStop.com
ఇక మరికొద్ది రోజులలో ఈ సంవత్సరం ముగిసిపోతుంది.దీంతో ఈ ఏడాది అద్భుతమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నాయి.
అయితే చాలా మంది కొత్త డైరెక్టర్లు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.ఇలా ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి వీళ్ళు మొదటి సినిమాతోనే ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
మరి ఈ ఏడాది డైరెక్టర్లుగా ఇండస్ట్రీకి పరిచయమై మొదటి సినిమాతోనే హిట్ అందుకున్నటువంటి డైరెక్టర్లు ఎవరు వారు తీసిన సినిమాలు ఏవి అనే విషయానికి వస్తే.
"""/" /
ఈ ఏడాది నాచురల్ స్టార్ నాని( Nani ) ఏకంగా రెండు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ సినిమాలను అందుకున్నారు.
ఇక ఈ రెండు సినిమాల ద్వారా కూడా ఈయన ఇద్దరు కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు.
ఈ ఇద్దరు డైరెక్టర్లు నానితో సినిమాలు చేసే బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని అందుకున్నారని చెప్పాలి.
మరి ఆ ఇద్దరు డైరెక్టర్లు ఎవరు అంటే.శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) అలాగే శౌర్యువ్(Shouryuv).
"""/" /
H3 Class=subheader-styleశ్రీకాంత్ ఒదెలా:/h3p ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ దగ్గర శిష్యుడిగా పని చేసినటువంటి శ్రీకాంత్ అనంతరం నాని హీరోగా తెరకెక్కినటువంటి దసరా (Dasara) సినిమాకు దర్శకుడిగా పనిచేశారు.
ఇలా ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమైనటువంటి శ్రీకాంత్ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నార.
ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడం విశేషం.
సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో తెరకేక్కిన ఈ సినిమాలో నానితో కీర్తి సురేష్ కలిసి నటించారు.
ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకుంది.ఇక ఈ సినిమా ద్వారా దర్శకుడు మొదటి సక్సెస్ అందుకున్నారు అయితే తదుపరి సినిమాను మాత్రం ఇప్పటివరకు ప్రకటించలేదు.
"""/" /
H3 Class=subheader-styleశౌర్యువ్: /h3pనాని తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి చిత్రం హాయ్ నాన్న(Hi Nanna).
ఈ సినిమా కూడా ప్రేక్షకులను పెద్ద ఎత్తున థియేటర్లలో సందడి చేస్తోంది.డిసెంబర్ 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ఇప్పటివరకు 50 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిందని తెలుస్తుంది.
ఇక ఈ సినిమాకు శౌర్యువ్ అనే కొత్త దర్శకుడు పని చేశారు.ఇక ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి శౌర్యువ్ మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకుంటున్నారు.
మరి ఇలా మొదటి సినిమాల ద్వారానే మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఇద్దరి హీరోలని నాని పరిచయం చేయడం విశేషం.
మరి వీరి తదుపరి సినిమాలను ఏ హీరోతో చేస్తారు అనే విషయాలు తెలియాల్సి ఉంది.
ఎన్ఆర్ఐ పెట్టుబడులే లక్ష్యం .. భారీ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు మధ్యప్రదేశ్ సర్కార్ ఏర్పాట్లు