జొన్న పంటను ఆశించే బంక తెగులు, చీడపీడల నివారణ కోసం చర్యలు..!

జొన్న చిరుధాన్యాల పంటలలో ఒకటి.జొన్నలు( Sorghum ) ఆహారంగా, పశుగ్రాసంగా ఉపయోగిస్తారు.

 Sorghum Cultivation Methods , Sorghum Cultivation , Sorghum , Formers , Carbaryl-TeluguStop.com

పాడి పశువులు ఉండే రైతులు కచ్చితంగా జొన్న పంటను సాగు చేయడానికి ఆసక్తి చూపిస్తారు.జొన్నకు మార్కెట్లో ఏడాది పొడవునా మంచి డిమాండ్ ఉంటుంది.

అయితే జొన్నకు చీడపీడల బెడద, తెగుల బెడద కాస్త ఎక్కువగానే ఉంటుంది.కాబట్టి సకాలంలో వీటిని గుర్తించి నివారించుకోవాలి.

బంక తెగులు: జొన్న మొక్క పుష్పించే దశలో ఉన్నప్పుడు, వాతావరణం లో చల్లని తేమ ఏర్పడితే ఈ బంక తెగులు వ్యాప్తి చెందుతుంది.తెల్లని లేదా గులాబీ రంగులో తీయటి జిగురు వంటి ద్రావణం కనిపిస్తే వాటిని బంక తెగులుగా నిర్ధారించుకోవాలి.

ఈ బంక తెగులు సోకిన మొక్క పై శిలీంద్రాలు పెరగడంతో జొన్న కంకులు నలుపు రంగులోకి మారుతాయి.ఈ తెగులను సకాలంలో గుర్తించకపోతే చేతికి వచ్చే పంట 90 శాతానికి పైగా నాశనం అవుతుంది.

Telugu Agriculture, Carbaryl, Formers, Latest Telugu, Mancozeb, Sorghum-Latest N

ఈ బంక తెగులు నివారణకు ముందుగా విత్తనాలను మూడు గ్రాముల థైరం తో విత్తన శుద్ధి చేసుకోవాలి.జొన్న పంట పూత దశకు వస్తున్న సమయంలో లీటరు నీటిలో రెండు గ్రాముల మాంకోజెబ్( Mancozeb ) కలిపి మొక్కల పైభాగం పై చల్లాలి .లేదంటే లీటర్ నీటిలో ఒక గ్రామ్ బెన్ లేట్ ను కలిపి పంటపై చల్లాలి.ఒక వారం వ్యవధిలో రెండుసార్లు పంటకు పూత దశలో ఉన్నప్పుడు చల్లాలి.

Telugu Agriculture, Carbaryl, Formers, Latest Telugu, Mancozeb, Sorghum-Latest N

కంకి నల్లి పురుగులు: జొన్న గింజలు పాల దశలో ఉన్నప్పుడు ఈ పురుగులు పూర్తిగా రసాన్ని పీల్చేస్తాయి.తద్వారా గింజలు ఎరుపు రంగు మచ్చలు ఏర్పడి క్రమంగా నల్లగా మారుతాయి.కాబట్టి తొలి దశలోనే వీటిని గుర్తించి నివారించాలి.ఒక ఎకరం పొలంలో 8 కిలోల కార్బరిల్ (Carbaryl ) పొడి మందును జొన్న కంకులపై చల్లాలి.సకాలంలో జొన్న పంటలో సస్యరక్షక పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడి పొందవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube