సీనియర్ నటి, వైసీపీ మంత్రి రోజాపై( Minister Roja ) టీడీపీ నేత బండారు సత్యనారాయణ చేసిన కామెంట్ల విషయంలో తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం కావడంతో పాటు టాలీవుడ్ ప్రముఖ నటీమణులు రోజాను సపోర్ట్ చేస్తూ వీడియో స్టేట్మెంట్ ఇచ్చారు.అయితే ప్రముఖ సామాజికవేత్త కృష్ణకుమారి( Social Activist Krishna Kumari ) రోజాను వెనకేసుకొచ్చే హీరోయిన్లకు నా ఓపెన్ ఛాలెంజ్ ఇదేనంటూ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
బండారు సత్యనారాయణ( Bandaru Satyanarayana ) చేసిన కామెంట్లను సమర్థించలేమని ఆమె అన్నారు.ఆయన తన కోపం కట్టలు తెంచుకుంది కాబట్టి అలా అన్నారని కేవలం రాజకీయంగా మాత్రమే చూడాలని ఆయన చెప్పారని అయితే ఆ వ్యాఖ్యలు సమంజసం కావని కృష్ణకుమారి పేర్కొన్నారు.
మహిళ ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసే విధంగా కామెంట్లు చేయడం ఎవరు చేసినా కరెక్ట్ కాదని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.
రోజాకు ( Roja ) రావాల్సినంత సానుభూతి రాలేదు కాబట్టి హీరోయిన్లు ఆమెకు మద్దతు తెలిపారని కృష్ణకుమారి కామెంట్లు చేశారు.రోజా గురించి స్పందించిన వాళ్లు సమాజంలో ఇన్ని జరుగుతుంటే ఏరోజైనా స్పందించారా అంటూ కృష్ణకుమారి ఓపెన్ ఛాలెంజ్ విసిరారు.రాధిక,( Radhika ) ఖుష్బూ,( Khushboo ) రమ్యకృష్ణ,( Ramyakrishna ) మీనా( Meena ) మాట్లాడటం నాకు కూడా ఆశ్చర్యాన్ని కలిగించిందని కృష్ణ కుమారి అభిప్రాయం వ్యక్తం చేశారు.
రోజా గురించి వైసీపీ మహిళా నేతలు స్పందించకుండా సినిమా హీరోయిన్లు స్పందిస్తే టీడీపీ నేతలు వాళ్ల గురించి విమర్శలు చేయరని కృష్ణకుమారి అన్నారు.భువనేశ్వరి వ్యక్తిత్వం గురించి వైసీపీ నేతలు మాట్లాడిన సమయంలో రోజా ఏం చేశారని కృష్ణకుమారి ప్రశ్నించారు.రోజా అడిగి వాళ్లతో చెప్పించుకుందని కృష్ణకుమారి కామెంట్లు చేశారు.కృష్ణకుమారి కామెంట్ల గురించి రోజా ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.రోజా ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు.