మొన్నటి వరకు కాంగ్రెస్ లో తమ పార్టీ విలీనం అవుతుందని , తాను కోరుకున్న స్థానంతో పాటు, తన అనుచరులకు పెద్ద ఎత్తున టికెట్లు ఇప్పించుకోవచ్చు అని భావించిన షర్మిలకు నిరాశే కలిగింది. కాంగ్రెస్ లో వైఎస్సార్ తెలంగాణ పార్టీని విలీనం చేసే ప్రక్రియ దాదాపు ఒక కొలిక్కి వచ్చి చివరి నిమిషంలో సీన్ రివర్స్ అయింది.
ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ రాజకీయాల్లో ఉండకూడదని, ఏపీ రాజకీయాలకే ఆమెను పరిమితం చేయాలని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలతో పాటు , తెలంగాణ కాంగ్రెస్( Telangana Congress ) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వంటి వారు అధిష్టానం వద్ద లాభియింగ్ చేశారు.దీంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది.
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్( Dk Siva Kumar ) ద్వారా షర్మిల ( YS Sharmila )కాంగ్రెస్ అధిష్టానం వద్ద లాభియింగ్ చేసినా నిరాశే ఎదురయింది.షర్మిల ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ కావాలని కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు సూచించినా, ఆమె మాత్రం తెలంగాణ రాజకీయాలలోనే తాను ఉంటానని, ఏపీ రాజకీయాల్లోకి అడుగుపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
దీంతో వైఎస్సార్ తెలంగాణ పార్టీ విలీన ప్రక్రియ నిలిచిపోయింది.దీంతో ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేయాలని షర్మిల నిర్ణయించుకున్నారు.
ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక దాదాపుగా ఖరారు కావడంతో, ఆ పార్టీ పూర్తిగా ఆశలు వదులుకుంది.ఈ మేరకు ఎన్నిక కార్యాచరణను ప్రకటించేందుకు షర్మిల సిద్ధమవుతున్నారు .ఈనెల 12 నుంచి ఎన్నికల భరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు .ఈ మేరకు ఆరుగురి తో ప్రత్యేక మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేశారు.ఇక షర్మిల( YS Sharmila ) పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.
ఈ మేరకు పాలేరు నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు .ఈ మేరకు కార్యకర్తలతో ఆమె సమావేశం కాబోతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో.
అందుబాటులో ఉన్న పార్టీ నాయకులతో షర్మిల ( YS Sharmila )సమావేశం నిర్వహించబోతున్నారు .ఈనెల 12 నుంచి పూర్తిస్థాయిలో ఎన్నికల కార్యచరణ ప్రకటించి ప్రచారం మొదలు పెట్టాలని నిర్ణయించారు.అలాగే తమ పార్టీ తరఫు నుంచి పోటీ చేయాలనుకునే అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించాలని నిర్ణయించుకున్నారు ఈనెల 17 లేదా 18 తేదీన అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు.
పూర్తిస్థాయిలో పార్టీ మేనిఫెస్టోను రూపొందించే నిమిత్తం ఆరుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు .ఆ కమిటీ పూర్తిస్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత ఏ విధమైన హామీలు ఇవ్వాలని దానిపైన నిర్ణయించి మ్యానిఫెస్టో ను ప్రకటించబోతున్నారు.