ఉదయనిధి స్టాలిన్ వల్ల ఆ హీరో హీరోయిన లవ్ బ్రేక్ అయ్యిందా?

హన్సిక( Hansika ).అల్లు అర్జున్ దేశముదురు సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయింది.

 Simbu And Hansika Love Breakup Due To Udayanidhi Stalin , Udayanidhi Stalin, Shi-TeluguStop.com

ఈ అమ్మడు ఆ తర్వాత వరుస పెట్టి సినిమాలు చేసింది.తెలుగుతో పాటు కన్నడ, తమిళ్ మరియు హిందీలో కూడా ఆమె తన ప్రతిభను చాటుకుంది అయితే సినిమాలతో పాటు అఫైర్స్ కొనసాగించడంలో కూడా హన్సిక రాటు తేలిపోయింది.

అప్పట్లో ఆమె కుర్ర హీరోలతో కలిసి చెక్కర్లు కొట్టడం సర్వత్ర చర్చకు దారి తీసింది.మరీ ముఖ్యంగా శింబు( Shimbu ) తో ఆమె ప్రేమాయణం దాదాపు పెళ్లి పీటలెక్కినంత వరకు వెళ్ళింది.

హన్సిక శింబు పెళ్లి చేసుకుంటామంటూ కూడా సోషల్ మీడియాలో ప్రకటించుకున్నారు.మీడియా ముందు కూడా ఈ విషయాన్ని ఒప్పుకున్నారు.

కానీ ఉన్నఫలంగా హన్సిక హార్ట్ బ్రేక్ అయిపోయి శింబుకి బ్రేకప్ చెప్పేసింది.

Telugu Hansika, Shimbu, Simbuhansika-Movie

మరి హన్సిక హార్ట్ బ్రేక్ అవ్వడానికి కారణం మరొక హీరో అన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.శింబు, హన్సిక ఘాటుగా ప్రేమించుకున్నారట అప్పట్లో.శింబు ఎక్కడ షూటింగ్ జరిగినా హన్సిక పక్కనే ఉండేవారట.

ఆమె విదేశాల్లో షూటింగ్ కి వెళ్ళినా కూడా ఆమె దగ్గరికి వెళ్లి పోయే వాడట.మరి అంతలా ప్రేమించుకున్న వీళ్లిద్దరి మధ్య బ్రేకప్ కి కారణమైన హీరో మరెవరో కాదు.

ప్రస్తుతం హిందూ సనాతన ధర్మంపై అవాకులు, చివాకులు పేలుతున్న తమిళనాడు మంత్రి మరియు హీరో అయిన ఉదయనిది స్టాలిన్( Udayanidhi Stalin ).హన్సిక మరియు ఉదయినిది స్టాలిన్ ఇద్దరు కలిసి ఒకే ఒక సినిమాలో నటించారు.

Telugu Hansika, Shimbu, Simbuhansika-Movie

ఈ టైంలో హన్సిక ఉదయనిధి స్టాలిన్ తో కాస్త క్లోజ్ గా మూవ్ అవుతూ ఉండేదట. కొన్నాళ్ల పాటు గుట్టుగానే సాగిన వీరి ప్రేమ బంధం ఆ నోటా ఈ నోటా శింబు వరకు చేరిందట.ఈ విషయం తెలిసిన శింబు కోపంతో రగిలిపోయాడట ఆమెకు ఫోన్ చేసి చెడా మడా తిట్టేసాడట.తాను శింబు నీ తప్ప ఎవరిని ప్రేమించడం లేదని చెప్పినా కూడా ఆ పరిస్థితులలో అతడు వినేలా లేడట.

దాంతో మనసు విరిగిపోయిన హన్సిక ఇక నీకు నాకు కుదరదు అంటూ బ్రేకప్ చెప్పేసిందట.అలా ఉదయనిధి స్టాలిన్ కారణంగా శింబు, హన్సిక విడిపోవలసి వచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube