కొన్ని సిల్లి ప్రశ్నలు అమ్మాయిలు మాత్రమే వేస్తారు.ఎందుకంటే ఆ ప్రశ్నలు అడగాల్సిన అవసరం కాని, సమయం కాని అబ్బాయిల ముందుకి రావు గనుక.
ఆ ప్రశ్నలు అమ్మాయిలకి సింపుల్ గా అనిపించవచ్చు కాని, అబ్బాయిలకి మాత్రం చాలా సిల్లిగా అనిపిస్తాయి.పచ్చిగా చెప్పాలంటే విసుగు పుట్టించేలా ఉంటాయి.
ఆ సిల్లి ప్రశ్నలు ఏంటో చూడండి.
* నేను లావు ఎక్కుతున్నానా ?
ఈ ప్రశ్నకు జవాబివ్వడం అబ్బాయిలకు చాలా కష్టమైన పని.లావుగా ఉన్నావు అంటే అదో బాధ, ఇంత చిక్కిపోయి ఉన్నావేంటి అంటే మరో బాధ.అందుకే ఎలా ఉన్నా మామూలుగానే ఉన్నావు అని ఓ టెంప్లెంట్ ఆన్సర్ పడేస్తారు.
* మీ అమ్మ ఎక్కువ? నేను ఎక్కువ?
సినిమాకి వెళ్దాం అని గర్ల్ ఫ్రెండ్ అడిగితే, అదే సమయానికి ఫంక్షన్ కి వెళదామని అమ్మ అడిగింది.ఇప్పుడు ఎటువెళ్ళాలో అలోచించి అమ్మవైపే ఓటేస్తాడు అబ్బాయి.
అయితే అమ్మాయి అర్థం చేసుకుంటుందన్న నమ్మకంతో ఆ పని చేస్తాడు.అంతమాత్రానికే ఇటువంటి భారి డైలాగులు అవసరం లేదు.
* నాకంటే ఆ అమ్మాయి అందంగా ఉందా?
ఇదేమి ప్రశ్న అని ఖచ్చితంగా తిట్టుకుంటాడు అబ్బాయి.మీకంటే అందంగా ఉందని మిమ్మల్ని వదులుకోలేడు కదా.ఎలా ఉన్నా అతనికి మీరంటే అతనికి ఇష్టం.అది చాలు.
* అప్పుడే నిద్ర వస్తోందా?
ఎప్పుడో అర్థరాత్రి ఈ ప్రశ్న అడిగితే ఓపికలేక కోపం తన్నుకుంటూ రావొచ్చు.అది నిద్రపోయే సమయం అయినప్పుడు అడగటమెందుకు.
* నా మీద ఇష్టం తగ్గిందా?
ఒకవేళ అదే జరిగితే, పైన పేర్కొన్న ప్రశ్నలు కూడా కారణం కావచ్చు.ఎందుకంటే మాటల్లో ఎప్పుడు విసుగు పుట్టించే అంశాలు ఉండకూడదు.
ఈ కాలంలో విసిగించకుండా మాట్లాడటం చాలా అవసరం కూడా.అలాగే ప్రతి చిన్న విషయానికి ” నా మీద ఇష్టం తగ్గిందా” అనే అతి వద్దు.
అలా విసిగిస్తే నిజంగానే ఇష్టం తగ్గొచ్చు.