టాలీవుడ్ హీరో సిద్దు జొన్నలగడ్డ( Siddhu Jonnalagadda ) హీరోగా నటించిన తాజా చిత్రం టిల్లు స్క్వేర్.( Tillu Square ) అనుపమ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
గతంలో విడుదల అయినా డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కింది.గత నెల మర్చి 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన టిల్లు స్క్వేర్ ఇప్పటికే వంద కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు.యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడిన హీరో సిద్ధు జొన్నల గడ్డ ఎమోషనల్ అయ్యారు.సినిమా సక్సెస్ అయ్యినందుకు మా టీమ్ అందరికీ అభినందనలు.డైరెక్టర్ మల్లిక్ రామ్, హీరోయిన్ అనుపమ.ఇలా అందరు మీరు ప్రేమ కురిపించారు.
అందుకు ధన్యవాదాలు.ఇక్కడ ఇద్దరి గురించి ప్రత్యేకంగా మాట్లాడాలి.
అందులో మొదట చెప్పుకోవాల్సింది త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) గురించి.డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాల్లో త్రివిక్రమ్ ఇన్వాల్వ్ మెంట్ ఎంతుందని అడుగుతున్నారు.
దానికి సమాధానం చెప్పేందుకు ఈరోజు మంచి సందర్భం దొరికింది.
ఒక స్టూడెంట్ జీవితంలో ఒక టీచర్ ఇన్వాల్వ్ మెంట్ ఎంతుందో అంతే త్రివిక్రమ్ పాత్ర ఉంది.సినిమా, జీవితం, క్రాఫ్ట్స్,.ఇలా చాలా విషయాలు గురూజీ నుంచి నేర్చుకున్నా.
ఇందుకు గానూ ఆయనకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను.ఆయన నుంచి నేను చాలా నేర్చుకున్నాను.
త్రివిక్రమ్ ను కలివక ముందు నేను వేరే మనిషిని కలిసిన తర్వాత మరో మనిషిని.థ్యాంక్యూ సార్అని త్రివిక్రమ్ గురించి చెప్పుకొచ్చారు సిద్ధూ.
తర్వాత సిద్దు ఎన్టీఆర్( NTR ) గురించి మాట్లాడుతూ.ఎన్టీఆర్ పేరేత్తగానే అభిమానుల నుంచి హర్ష ధ్వానాలు మొదలయ్యాయి.వేదిక అంతటా జై ఎన్టీఆర్ నినాదాలే వినిపించాయి.పిలిచిన వెంటనే షెడ్యూల్ అరేంజ్ చేసుకుని ఈ సినిమా ఈవెంట్ కు వచ్చినందుకు తారక్ అన్నకు ధన్యవాదాలు.నాకేమైనా అవార్డులు వచ్చాయా? అని చాలామంది అడిగారు.నేను చెప్పిన డైలాగ్ ఎన్టీఆర్ నోట నుంచి రావడం కన్నా పెద్ద అవార్డు ఉండదు.
ఆయన తెలుగు సినిమాకు నిజమైన టార్చ్ బేరర్ అని చెప్పుకొచ్చాడు సిద్ధు.ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు మీడియాలు వైరల్ గా మారాయి.