తెలుగు సినీ ప్రేక్షకులకు యాంకర్ రష్మీ( Anchor Rashmi ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.రష్మీ ప్రస్తుతం ఒక వైపు సినిమాలో నటిస్తూనే మరొకవైపు యాంకర్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే.
ఇటు బుల్లితెర ప్రేక్షకులను అటు వెండితెర ప్రేక్షకులను అలరిస్తోంది.జబర్ధస్త్ ద్వారా మంచి పాపులారిటీ తెచ్చుకుంది.
ప్రస్తుతం జబర్దస్త్ షో( Jabardasth ) తో పాటు ఎక్స్ట్రా జబర్దస్త్ అలాగే పండుగ ఈవెంట్లకు యాంకర్ గా వ్యవహరిస్తోంది.ఇదిలా ఉంటే.
రష్మి, సుధీర్ జోడికి సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ఫాలోయింగ్ ఉందో మనందరికి తెలిసిందే.
వీళ్లు ఇద్దరు కెమిస్ట్రీకి ప్రత్యేక ఫ్యాన్స్ బేస్ ఉందంటే అతిశయోక్తి కాదు.దీంతో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుండూ అని చాలా మంది ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.అంతేకాకుండా ఇప్పటికే కొన్ని స్క్రిప్ట్‌లలో వాళ్లు పెళ్లి చేసుకోవడంతో జంటగా బాగుంటుందని టాక్ కూడా వచ్చింది.
వీళ్లిద్దరూ కలిసి చేసిన షోలకు మంచి రేటింగ్ ఉండేది.కానీ, ప్రస్తుతం సుధీర్( Sudheer ) సినిమాలతో బిజీగా ఉండటంతో బుల్లితెరపై అంతగా కనిపించడం లేదు.
ఇక రష్మి మాత్రం సింగిల్‌గా తన షోలు తను చేసుకుంటుంది.దాంతో పాటు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అందాలను ఆరబోస్తూ ఉంటుంది.
అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది.ఇది ఇలా ఉంటే తాజాగా రష్మి తనకు ఎలాంటి భర్త కావాలో చెప్పుకొచ్చింది.రీసెంట్‌గా ఒక షోలో పాల్గొన్న రష్మి మాట్లాడుతూ.నాకు కాబోయే వాడు నేను చెప్పిందే చేయాలి.చేసిందే నాకు చెప్పాలి అనీ చెప్పుకొచ్చింది రష్మి.ప్రస్తుతం ఆమె కామెంట్స్ వైరల్ కావడంతో, మరి సుధీర్ అన్న పరిస్థితి ఏంటీ అన్నా ఎక్కడికి వెళ్లాడో నీకు చెప్తున్నాడా అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్స్.
మరి ఈ కామెంట్స్ పై రష్మీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.