డీజే టిల్లు( DJ Tillu ) సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిన సిద్ధు జొన్నలగడ్డ( Siddhu Jonnalagadda ) త్వరలో దీనికి సీక్వెల్ సినిమా టిల్లు స్క్వేర్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.ఇలా కెరియర్ పరంగా ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈయన తాజాగా మరో కొత్త సినిమా పూజ కార్యక్రమాలను ఘనంగా ప్రారంభించుకున్నారు.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో నీరజ కోన దర్శకత్వంలో సిద్ధు హీరోగా, శ్రీనిధి శెట్టి( Srinidhi Shett y), రాశిఖన్నా(Raashii Khanna) హీరోయిన్స్ గా తెలుసు కదా ( Telusu Kada ) అనే ఆసక్తికర టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.
తాజాగా ఈ సినిమా పూజ కార్యక్రమాలను ఎంతో ఘనంగా ప్రారంభించుకున్నారు.ఈ సినిమా పూజ కార్యక్రమాలలో భాగంగా యంగ్ హీరోలు అయినటువంటి నితిన్ ( Nithin ), నాని ( Nani) ఈ సినిమా పూజా కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా హాజరై సందడి చేశారు.ఇక ఈ సినిమా పూజ కార్యక్రమాలలో భాగంగా సిద్దు జొన్నలగడ్డ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.
ఈ పూజా కార్యక్రమాలలో ఈయన అయ్యప్ప స్వామి మాలలో కనిపించడం విశేషం.ఒకప్పుడు సీనియర్ హీరోలు అయినటువంటి చిరంజీవి మురళీమోహన్ వంటి వారందరూ ఇలా దేవుడి మాలవేసి భక్తి భావం చాటుకునేవారు.
యువ హీరోలు కూడా తరచూ ఇలా స్వామి మాలలలో కనిపిస్తూ వారిలో ఉన్నటువంటి భక్తి భావాన్ని బయటపెడుతున్నారు.రామ్ చరణ్ ప్రతి ఏడాది అయ్యప్ప మాల వేయడం మనం చూస్తుంటాము.అయితే నితిన్ కూడా ఆంజనేయ స్వామి మాలలో కనిపిస్తుంటారు.తాజాగా విశ్వక్ సేన్ కూడా ఆంజనేయ స్వామి మాల ధరించి కనిపించారు.ఈ క్రమంలోనే సిద్దు జొన్నలగడ్డ సైతం ఇలా అయ్యప్ప మాలలో కనిపించడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అవ్వడమే కాకుండా ఈయనలో ఇలాంటి యాంగిల్ కూడా ఉందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.