ఏడో తరగతిలోనే ఏఐ కంపెనీలు.. ఈ విద్యార్థుల సక్సెస్ స్టోరీ వింటే వావ్ అనాల్సిందే!

చిన్న వయస్సులోనే పిల్లలు కెరీర్ పరంగా సక్సెస్ సాధిస్తే తల్లీదండ్రుల ఆనందానికి అవధులు ఉండవనే సంగతి తెలిసిందే.సిద్దార్థ్,( Siddarth ) సౌమ్య( Sowmya ) కవల పిల్లలు కాగా 14 సంవత్సరాల వయస్సు ఉన్న ఈ పిల్లలు తమ ప్రతిభతో అద్భుతాలు సృష్టిస్తున్నారు.

 Siddarth Sowmya Inspirational Success Story Details, Siddarth ,sowmya, Siddarth-TeluguStop.com

హైదరాబాద్ రామాంతపూర్ లో పుట్టిన సిద్దార్థ్, సౌమ్య తర్వాత తల్లీదండ్రులతో కలిసి అమెరికాకు వెళ్లారు.ప్రస్తుతం సిద్దార్థ్, సౌమ్య తొమ్మిదో తరగతి చదువుతున్నారు.

చిన్న వయస్సులోనే ఏఐలో( AI ) ప్రావీణ్యం సంపాదించిన సిద్దార్థ్, సౌమ్య ఏడో తరగతి చదువుతున్న సమయంలోనే చెరో కంపెనీ స్థాపించి ప్రశంసలు అందుకుంటున్నారు.గ్లోబల్ ఏఐ సదస్సులో( AI Global Summit ) పాల్గొనడానికి సిద్దార్థ్, సౌమ్య పాల్గొనడానికి వచ్చి తమ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించడం జరిగింది.

ఏడు సంవత్సరాల వయస్సులోనే సిద్దార్థ్ కు కోడింగ్ పై ఆసక్తి ఏర్పడగా లింక్డిన్ లెర్నింగ్, యూట్యూబ్ ద్వారా సిద్దార్థ్ వేర్వేరు లాంగ్వేజెస్ నేర్చుకున్నాడు.

Telugu Ai Summit, Drive Company, Hyderabad, Siddarth, Siddarthsowmya, Sowmya, So

ఒరాకిల్, ఆర్మ్ నుంచి మిషన్ లెర్నింగ్, ఏఐపై సిద్దార్థ్ ప్రావీణ్యం సంపాదించాడు.అతిచిన్న వయస్సులో ఏఐలో సర్టిఫైడ్ అయిన సిద్దార్థ్ స్టెమ్ ఐటీ( STEM IT ) పేరుతో కంపెనీని స్థాపించాడు.సిద్దార్థ్ సొంతంగా అల్గారిథమ్ లు రాస్తూ ఏఐ ఆధారిత ఉత్పత్తులను రూపొందిస్తున్నాడు.

సిద్దార్థ్ రూపొందించిన వాటిలో వృద్ధుల కొరకు చేసిన ఫాల్ డిటెక్షన్ బ్యాండ్, ఏఐతో పని చేసే ప్రోస్థటిక్ హ్యాండ్ బాగా ప్రాచుర్యం పొందాయి.

Telugu Ai Summit, Drive Company, Hyderabad, Siddarth, Siddarthsowmya, Sowmya, So

మరోవైపు సౌమ్య సైతం డ్రైవ్ ఇట్( Drive IT ) అనే సంస్థను మొదలుపెట్టి ఈ ఫ్లాట్ ఫాం ద్వారా లైసెన్స్ రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకుంటే నెల లేదా వారంలో అపాయింట్ మెంట్లు లభించేలా చర్యలు చేపడుతున్నారు.ఇప్పటివరకు ఏకంగా 10,000 మంది ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవడం గమనార్హం.సిద్దార్థ్, సౌమ్య సక్సెస్ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వీళ్లిద్దరి టాలెంట్ ను నెటిజన్లు ఎంతగానో మెచ్చుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube