తెలుగు సినిమా ఇండస్ట్రీకి నటి మాలశ్రీ సుభరిచితమే( Actress Malashree ).మాలశ్రీ హీరోయిన్ గా ఒక రేంజ్ లో పాపులర్ గా ఉన్న సమయంలో ఆమె చెల్లెలు శుభశ్రీని సైతం ఇండస్ట్రీకి పరిచయం చేసింది.
అక్క లాగా శుభ పాపులర్ హీరోయిన్ అయితే అవ్వలేదు కానీ ఒక భిన్నమైన హీరోయిన్ గా మాత్రం తెలుగు, కన్నడ మరియు తమిళ్ ప్రేక్షకులకు బాగానే పరిచయం అయింది.తన కెరియర్ మొత్తంగా 30కి పైగా సినిమాల్లో నటించింది శుభశ్రీ.
అయితే ఆమె ఎక్కువగా సినిమాల విషయానికి వచ్చేసరికి ఒకే హీరోతో అరడజన్ కి పైగా సినిమాల్లో హీరోయిన్ గా నటించింది అనే విషయం ఎవరికీ తెలియదు మరి ఆ హీరో ఎవరు ? ఎందుకు ఒకే హీరోతో నటించింది ? అనే విషయాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
శుభశ్రీ తెలుగులో మొట్టమొదటిగా నటించిన సినిమా అందరూ అందరే.ఆ తర్వాత పెదరాయుడు, పోకిరి రాజా, గ్యాంగ్ మాస్టర్, పుణ్యభూమి నాదేశం వంటి సినిమాలో ఆమె నటించింది.అయితే అప్పటి వరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిన్న చిన్న రోల్స్ లోనే కనిపించిన శుభశ్రీ తొలిసారిగా ఆలీ( Ali ) సరసన 1996లో ఊహ అనే చిత్రంలో నటించింది.
ఈ సినిమాలో ఊహ లీడ్ రోల్ పోషించినప్పటికీ శుభశ్రీ( Subhashri ) కూడా సెకండ్ లీడ్ రోల్ లో నటించింది.ఆ తర్వాత శుభశ్రీ ఆలీ మధ్యన మంచి ర్యాపో పెరిగింది.
దాంతో వారిద్దరి మధ్య ఏదో జరుగుతుంది అనే గుసగుసలు కూడా వచ్చాయి.ఆ తర్వాత వరుసగా ఆలీ శుభశ్రీ అరడజన్ కి పైగా సినిమాల్లో కలిసి నటించారు.
ఊహ చిత్రం తర్వాత అల్లరి పెళ్ళాం( Allari pellam ) అనే సినిమాలో హీరోయిన్ గా అలీ సరసన మొదటిసారి మెయిన్ లీడ్ గా నటించిన శుభశ్రీ ఆ తర్వాత హలో నీకు నాకు పెళ్ళంట అనే మరో సినిమా అదే ఏడాది ఆలి పక్కన నటించింది.
ఇక శుభశ్రీ ఒక ఏడాది తిరగకుండానే కుర్రాల రాజ్యం, అల్లరి పెళ్లి కొడుకు( kurralla rajyam ) అనే మరో రెండు సినిమాల్లో ఆలి కి హీరోయిన్ గా నటించింది.కలియుగంలో గంధరగోలం, ఆలీబాబా అద్భుత దీపం వంటి మరో రెండు సినిమాల్లో వీరిద్దరూ నటించి తమ క్రేజీ కాంబినేషన్ నీ కంటిన్యూ చేశారు.ఇలా దాదాపు 6 నుంచి 7 సినిమాలు కలిసి నటించిన తర్వాత ఆమె పెళ్లి చేసుకొని ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోవడంతో ఆలీకి శుభశ్రీకి మరో సినిమా పడలేదు.
అయితే వీరిద్దరిది అప్పట్లో హిట్టు పెయిర్ అని అందరు అంటుండేవారు.