తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో బీజేపీకి షాక్ తగిలింది.పార్టీకి కీలక నేత వివేక్ వెంకటస్వామి రాజీనామా చేశారు.
ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో వివేక్ వెంకటస్వామి భేటీ కానున్నారు.ఈ క్రమంలోనే కొడుకు వంశీతో కలిసి ఆయన హస్తం పార్టీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.
అయితే ఇప్పటికే వివేక్ కొడుకు వంశీకి చెన్నూర్ నియోజకవర్గం నుంచి టికెట్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని తెలుస్తోంది.ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోంటారనే వార్త జోరందుకుంది.