సీనియర్ నరేష్( Senior Naresh ) గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఈ మధ్య కాలంలో వేర్వేరు వార్తల ద్వారా సీనియర్ నరేష్ వార్తల్లో నిలిచారు.
సీనియర్ నరేష్ కొడుకు నవీన్ విజయకృష్ణ( Naveen Vijay Krishna ) పలు సినిమాలలో హీరోగా నటించినా ఆ సినిమాలు ఆశించిన రేంజ్ లో విజయం సాధించలేదనే సంగతి తెలిసిందే.సినిమాలకు నటుడిగా దూరమైన నవీన్ సాయితేజ్, స్వాతితో సత్య( Satya ) అనే షార్ట్ ఫిలింను తెరకెక్కించారు.
ఆరు నిమిషాల నిడివితో ఉన్న సోల్ ఆఫ్ సత్య( Soul Of Satya ) అనే సాంగ్ ఈ షార్ట్ ఫిల్మ్ నుంచి రిలీజ్ కాగా ఈ షార్ట్ ఫిల్మ్ సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.తాజాగా ఈ షార్ట్ ఫిల్మ్ ఖాతాలో అరుదైన ఘనత చేరింది.
అంతర్జాతీయ ఒనిరోస్ ఫిల్మ్ అవార్డ్స్( Oniros Film Awards ) వేదికపై ఈ షార్ట్ ఫిల్మ్ ను ప్రదర్శించగా ఈ షార్ట్ ఫిల్మ్ కు రెండు అవార్డులు వచ్చాయి.ఉత్తమ తొలి పరిచయ దర్శకుడిగా నవీన్ విజయకృష్ణకు అవార్డ్ రావడం గమనార్హం.
ఈ షార్ట్ ఫిల్మ్ కు హానరబుల్ మెన్షన్ అవార్డ్ కూడా వచ్చింది.సీనియర్ నరేష్ నవీన్ విజయకృష్ణకు అవార్డ్ రావడంతో పుత్రోత్సాహంతో పొంగిపోయారు.నరేష్ తన పోస్ట్ లో సాయితేజ్,( Saitej ) తదితరులు నటించిన సోల్ ఆఫ్ సత్య షార్ట్ ఫిల్మ్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒనిరోస్ అవార్డ్ వేదికలో సత్తా చాటిందని అన్నారు.ఈ షార్ట్ ఫిల్మ్ కు నా కొడుకు నవీన్ ఫస్ట్ టైమ్ డైరెక్టర్ అవార్డ్ గెలిచాడని చెప్పుకొచ్చారు.
మా కుటుంబంలో నాలుగోతరం నుంచి వచ్చిన నవీన్ కు మీ ఆశీర్వాదాలు కావాలని నరేష్ కామెంట్లు చేయడం గమనార్హం.ఈ షార్ట్ ఫిల్మ్ ను హిందీలో కూడా అందిస్తున్నామని నరేష్ అన్నారు.సమయం దొరికినప్పుడు చూసేయండి థాంక్యూ అని నరేష్ కామెంట్లు చేశారు.నరేష్ చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.