సినిమా ఇండస్ట్రీ లో చాలా మంది నటీనటులు సినిమాలు చేస్తూ వాళ్ళకంటు ఒక మంచి పేరు సంపాదించుకుంటారు అలంటి వాళ్లలో కవిత( Actress Kavitha ) ఒకరు… ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చిన ఈమె సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చి హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఒకానొక సమయంలో బిజీ గా గడిపారు.నటిగా రాణిస్తున్న సమయంలోనే వందల కోట్ల ఆస్తి ఉన్న ఒక వ్యక్తిని వివాహం చేసుకున్న ఈమె ప్రస్తుతం సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తూ ఉండడం నిజంగా బాధాకరమని చెప్పాలి.
కరోనా మహమ్మారి ఆమె జీవితాన్ని ఒక్కసారిగా అతలాకుతలం చేసింది…
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె.తాము తమ జీవితంలో ఏవేవి కోల్పోయామో చెప్పుకుంటూ ఎమోషనల్ అయింది.కవిత మాట్లాడుతూ… చిన్న వయసులోనే అనుకోకుండా ఇండస్ట్రీలోకి వచ్చి.20 ఏళ్లకు వివాహం చేసుకొని.పెళ్లయ్యాక శాశ్వతంగా సినిమాలకు దూరం అయ్యాను.అప్పటికే చేతిలో ఉన్న ప్రాజెక్టులు పూర్తిచేసి వెండితెరకు దూరం కావాల్సి వచ్చింది.కానీ కొన్నేళ్ల తర్వాత మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చాను.నా భర్తకు వందల కోట్ల ఆస్తులు ఉన్న మాట నిజమే.
మాకు 11 దేశాలలో ఆయిల్ బిజినెస్ లు కూడా ఉండేవి.నన్ను ఒక మహారాణిలా వారు చూసుకునేవారు.
నా ఇష్టాలను గౌరవించేవారు.అందుకే సినిమాలలోకి వస్తానని చెప్పినప్పుడు వారు అడ్డు చెప్పలేదు…
కానీ ఏడేళ్ల క్రితం మా వ్యాపారంలో నష్టం రావడంతో సుమారుగా మేము 132 కోట్ల రూపాయలను పోగొట్టుకున్నాము.ఫలితంగా కొన్ని ఆస్తులను కూడా అమ్ముకోవాల్సి వచ్చింది.ఆ టైం లో ఆయనకి కూడా ఆరోగ్యం బాగాలేదు దాదాపు 11 రోజులపాటు అలా కోమాలో ఉన్న ఆయనకు కరోనా మహమ్మారి చుట్టుముట్టింది.
మొదట కరోనా వచ్చి కుమారుడు చనిపోతే ఆ తరువాత 10 రోజులకే నా భర్త చనిపోయారు.
ఆ బాధ తట్టుకోలేక ఎన్నోసార్లు నేను ఒంటరితనాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాను.నాకు వచ్చిన కష్టం ముందు ఆత్మహత్య కూడా చాలా చిన్నది అనిపించింది నాకు కానీ అప్పుడు నా కూతుర్లను చూసి నేను ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాను.అందుకే ఆ బాధ నుంచి బయటపడాలంటే నేను సినిమాలలో మళ్ళీ బిజీ కావాలని నిర్ణయించుకున్నాను.
అందుకే సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్నా.అవకాశం వస్తే తప్పకుండా నటిస్తాను అంటూ చెప్పుకొచ్చింది…
.