సాధారణంగా పిల్లలకు తమ తల్లిదండ్రులు సపోర్టివ్ సిస్టమ్‌గా ఉంటారు.చిన్నతనం నుంచే ఛాలెంజింగ్ పనులు చేసేందుకు పేరెంట్స్ తమ పిల్లలను ప్రోత్సాహిస్తుంటారు.
వారి సపోర్ట్, ఎంకరేజ్‌మెంట్ వల్లే పిల్లలు ఎదగగలుగుతారు.కాగా ఇటీవల పిల్లలు పబ్లిక్‌లో డ్యాన్స్ చేయడానికి సిగ్గుపడిపోగా.
తండ్రి( Father ) వారిని భలే ఎంకరేజ్ చేశాడు.అంతేకాదు, వారిలో ఫుల్ జోష్ నింపి అదిరిపోయే స్టెప్పులు వేసేలా ప్రోత్సాహించాడు.
దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది.దీన్ని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
ఈ వీడియోను సాధన అనే యువ డ్యాన్సర్ పంచుకుంది.దీనికి క్యాప్షన్ జోడిస్తూ “పిల్లలు పెరిగేకొద్దీ మీరు చెప్పేది మరచిపోవచ్చు.కానీ మీరు వారికి ఎలాంటి ఫీలింగ్, ఎంకరేజ్‌మెంట్ అందిస్తారో, వారిని ఎలా ఫిల్ అయ్యేలా చేస్తారో దాన్ని వారు ఎప్పటికీ మరచిపోలేరు.ఈ సూపర్ డాడ్ మేం రీల్ షూట్ చేస్తున్నప్పుడు మమ్మల్ని పలకరించాడు.
ఆపై తన పిల్లలు మాతో డ్యాన్స్ చేయవచ్చా అని అడిగారు.పిల్లలలో జోష్ నింపి మాతో వారు డ్యాన్స్ చేసేలా చేశారు.అనంతరం ఆ తండ్రి ఖుషి అయ్యారు.” అని రాసుకొచ్చింది.
వైరల్ వీడియో( Viral video ) ఓపెన్ చేయగానే, మనకు ఒక పార్క్‌లో సాధన, ప్రణవ్ హెగ్డే( Pranav Hegde ) కలిసి డ్యాన్స్ చేయడం కనిపించింది.ఇంతలోనే ఒక తండ్రి తన పిల్లలతో కలిసి వారి వద్దకు వచ్చాడు.ఆపై తన పిల్లలను కూడా జాయిన్ చేసుకోవాలని కోరాడు.దాంతో వారు ఆశ్చర్యపోయారు.పిల్లలు మాత్రం భయపడ్డారు.పబ్లిక్ పార్క్‌లో డ్యాన్స్ చేయలేం అని కూతురు బాగా సిగ్గుపడింది.
ఇక కొడుకు కూడా అదే రియాక్షన్ ఇచ్చాడు.అయితే తండ్రి వారిని ఎంకరేజ్ చేశాడు.
‘ఈ లోకంలో బెస్ట్ అంటూ ఏదీ లేదు.మీకు వచ్చినట్లు డ్యాన్స్ చేయండి.ఇక్కడ అవార్డ్స్ ఏమీ ఇవ్వట్లే.జస్ట్ ఎంజాయ్ చేయండి.’ అని తండ్రి తన పిల్లలకు నచ్చజెప్పడం చూడవచ్చు.ఆపై పిల్లలు సాధన, ప్రణవ్‌తో కలిసి స్టెప్పులు వేశారు.
ఆ సమయంలో తండ్రి చప్పట్లు కొడుతూ వారిలోని సిగ్గు, బిడియాన్ని పోగొట్టాడు.ఈ వీడియో చూసి, డాడ్ అంటే ఇతడే, సూపర్ డాడ్, వావ్ గ్రేట్ డాడ్ అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
దీన్ని మీరు కూడా చూసేయండి.